- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోపంతో ఊగిపోతున్నారా?.. విటమిన్ బి6, బి12 లోపమే కారణం కావచ్చు !
దిశ, ఫీచర్స్ : మీరు ప్రతి సందర్భంలోనూ చిరాకు పడుతున్నారా? ప్రతి చిన్న విషయానికీ కోపంతో ఊగిపోతున్నారా? అయితే విటమిన్ బి6, బి12 లోపం కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. సాధారణంగా శరీరంలో వివిధ హార్మోన్లు, విటమిన్ల లోపం ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ ప్రత్యేకించి విటమిన్ బి6, బి12 విటమిన్ల లోపంవల్ల మాత్రం కోపం పెరగడం, నిర్లక్ష్యం చేస్తే క్రమంగా బీపీ, షుగర్ వంటి ప్రాబ్లమ్స్ తలెత్తడం జరుగుతుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. శరీరంలో ఇటువంటి మార్పులు, లోపాలపై అవగాహనలేక కొందరు ఎదుటి వ్యక్తిలో కోపిష్టి లక్షణాలను చూసి క్షణికావేశంలో బంధాలను, బంధుత్వాలను దూరం చేసుకుంటున్న సందర్భాలు కూడా చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు.
వాస్తవానికి విటమిన్ బి6, బి12 అనేవి మెదడును చురుకుగా, కూల్‌గా ఉంచడంలో సహాయపడతాయి. అందుకే మనం తీసుకునే ఆహారంలో భాగంగా ఇవి ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాదు ఈ విటమిన్లు తగిన స్థాయిలో లేకపోతే తరచూ కోపంతోపాటు నీరసం, అలసట, నిరాశ, డిప్రెషన్ వంటి భావాలు వెంటాడుతాయి. కొందరిలో తరచుగా ప్రతికూల ఆలోచనలు రావడానికి కూడా ఈ రెండు ముఖ్యమైన విటమిన్ల లోపం కూడా కారణం అయి ఉండవచ్చు. దీనికి తోడు శరీరంలో జింక్, మెగ్నీషియం లోపాలు కూడా సంభవిస్తే మెదడు పనితీరు మందగిస్తుంది. డిప్రెషన్, అల్జీమర్స్, నెగెటివ్ థింకింగ్స్ మరింత పెరిగిపోతాయి. కాబట్టి ఒక వారానికి మించి మీలో తరచూ చికాకు, కోపం, అలసట వంటి లక్షణాలు కనిపిస్తే విటమిన్ బి6, బి12 లోపాలు ఉన్నాయేమో వైద్యులను సంప్రదించి చెక్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.