- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిబ్లింగ్స్‌లో గిల్లికజ్జాల పరిష్కారానికి పేరెంట్స్‌కు టిప్స్!
దిశ, ఫీచర్స్ : ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే వారి మధ్య ప్రతి విషయానికి కీచులాట తప్పదని తెలిసిందే. పొద్దున ఎవరు ముందు స్నానం చేయాలన్న దగ్గరి నుంచి టిఫిన్, ఫుడ్, గేమ్స్.. ఆఖరికి బెడ్ విషయంలోనూ పిల్లల మధ్య గిల్లికజ్జాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒకవేళ ఏదైనా వస్తువు కోసం చిన్నోడు మంకుపట్టు పడితే.. పెద్దోడికి నచ్చచెప్పడం లేదా పెద్దోడి డిమాండ్లకు తలొగ్గి చిన్నోడిని సముదాయించడం తల్లికి ఒకరకంగా కత్తి మీద సామే. వారి నిత్య పోరాటాలకు మధ్యవర్తిత్వం చేయడం తలకు మించిన భారమే. నిత్యం పిల్లలతో ఇలాంటి అనుభవాలే ఎదుర్కొంటూ, పరిష్కారం కోసం వేచిచూస్తున్న తల్లుల కోసం నిపుణులు చిట్కాలు అందిస్తున్నారు.
సాధారణంగా సిబ్లింగ్స్ మధ్య బర్త్ ఆర్డర్, ఫ్యామిలీ డైనమిక్స్ వంటి విషయాలే వివాదాలను సృష్టిస్తాయి. వివిధ ఎదుగుదల దశలు, పేరెంట్స్ దృష్టిలో పడాలన్న పోటీ అనేది వారి మధ్య అసూయ, అపార్థాలకు దారితీయొచ్చు. ఇది ఆత్మగౌరవం, స్నేహాలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. వయసు భేదాలు, స్వభావం వంటి కారణాలను చాలా వరకు మార్చలేం. శాశ్వత పరిష్కార మార్గం కనుగొనలేం. కానీ ఉత్పాదక పరిష్కారాన్ని పరిమితం చేయడానికి, మెరుగుపరచడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అందులో కొన్ని :
* కోపంగా రియాక్ట్ కావద్దు :
పిల్లల చర్యలను పేరెంట్స్ తరచూ గమనిస్తుండటం ద్వారా ఏదైనా సమస్య తీవ్రతరమయ్యే లోపే ప్రతిస్పందించే చాన్స్ ఉంటుంది. చాలాసార్లు పిల్లల మధ్య విభేదాలు ఆటోమేటిక్‌గా తలెత్తవచ్చు. అలాంటప్పుడు పేరెంట్స్ ఆందోళనపడకుండా గట్టిగా ఊపిరి పీల్చుకోవాలి. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కోపం పద్రర్శిస్తే సమస్య పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలి. మీరు మీ ప్రశాంతత కాపాడుకుంటే పిల్లలు కూడా అదే ప్రశాంతతను అనుకరిస్తారు.
* కోఆపరేటివ్ ఎన్విరాన్‌మెంట్ క్రియేట్ చేయాలి :
పిల్లల మధ్య పోలికలను, పోటీని ప్రోత్సహించవద్దు. ఒకరికొకరు సహకరించుకునే, రాజీ కోసం అవకాశాలు పెంచుకునే వాతావరణాన్ని కల్పించాలి. నిజానికి తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లలకు ఆదర్శంగా నిలుస్తుంది. పేరెంట్స్ మధ్య గొడవలైనపుడు వస్తువులను పగలగొట్టడం లేదా బిగ్గరగా వాదించుకోవడాన్ని పిల్లలు చూసినట్లయితే.. తమ సమస్యల పరిష్కారానికి కూడా ఇదే మార్గాన్ని అనుసరించే అవకాశం ఉంది.
* యూనిక్‌నెస్‌ను గౌరవించాలి :
పిల్లలు తమ ప్రత్యేకతను విలువైనదిగా నమ్మితే ఘర్షణలో పాల్గొనే అవకాశం తక్కువ. కాబట్టి ప్రతి పిల్లవాడితో కొంత సమయాన్ని గడుపుతూ వారి యూనిక్‌నెస్‌ను ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఒకవేళ జాగింగ్ ఇష్టపడితే, మీరు కూడా వారితో చేరాలి. మరొక పిల్లవాడు బేకింగ్ ఇష్టపడితే.. అతనితో కలిసి వివిధ వంటకాలు ప్రయత్నించాలి. అంతేకాదు ఫ్యామిలీ మెంబర్స్ ఒకరి పర్సనల్ స్పేస్‌ను మరొకరు గుర్తించి గౌరవించుకునేలా ప్రోత్సహించేటువంటి నియమాన్ని సృష్టించాలి. ఒక పిల్లవాడు ఆడుకోకుండా విశ్రాంతి తీసుకోవడానికి అనుమతించాలి. మరొక సిబ్లింగ్ ఏం చేయాలనుకుంటున్నాడో సొంతంగా నిర్ణయించుకోనివ్వాలి. ఇది తోబుట్టువుల మధ్య పోటీని తగ్గించడంలో సాయపడుతుంది.
* ఫ్యామిలీ యాక్టివిటీస్ ప్లాన్ చేయాలి :
ఫ్యామిలీ పార్టీలు, బోర్డ్ గేమ్స్ ఆడటం, పార్క్‌లో టైమ్ స్పెండ్ చేయడం, సినిమాలు చూడటం తదితర కార్యకలాపాలు పిల్లలతో బంధాలను ఏర్పరచుకునేందుకు, మధురమైన జ్ఞాపకాలను పంచుకునేందుకు అద్భుతమైన మార్గాలు. ఇలా చేస్తే పిల్లలు పోట్లాడుకునే అవకాశం తక్కువై, మీతోనే ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటారు.
* సమానంగా కాదు న్యాయంగా గౌరవించాలి :
పేరెంట్స్ పిల్లల పట్ల న్యాయంగా ఉండటమంటే సమానంగా పంచడం కాదు. విధించే శిక్షలు, ఇచ్చే ప్రోత్సాహకాలు వారి నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా ఉండాలి. అంటే ఇద్దరు పిల్లలకు ఒకే తరహా బొమ్మ కాకుండా వారి వయసు, ఆసక్తికి తగిన బొమ్మలు ఇవ్వాలి. అంతేకాదు ఇద్దరి మధ్య తగాదా తలెత్తినపుడు తప్పు ఎవరిదో వేలెత్తి చూపకుండా ఆ సమస్యను ఎలా మెరుగ్గా నిర్వహించాలో పిల్లలిద్దరికీ నేర్పించడంపై దృష్టి సారించాలి. పిల్లలు ఆడుకునే బొమ్మలను తన సిబ్లింగ్‌కు ఇవ్వమని బలవంతపెడితే వారిలో కోపం, అసంతృప్తి పెరుగుతుంది. బదులుగా ఆ బొమ్మలను ఎలా షేర్ చేసుకోవాలి? ఒకరికొకరు ఎలా మార్చుకోవాలో తెలియజేయాలి.
* భావాలకు విలువనివ్వాలి :
ముందు పిల్లలు చెప్పే విషయాలను ఆలకించాలి. ఒక్కోసారి పెద్ద పిల్లలు లేదా చిన్న పిల్లలు భరించలేనంతంగా చాడీలు చెప్పొచ్చు. అయితే వారి మనోభావాలను చర్చించడానికి అనువైన స్థలం ఉందనే నమ్మకాన్ని ఇవ్వాలి. తమ తోబుట్టువులతో విభేదించిన విషయం సరైందేనని, మీరు దాన్ని గుర్తించారనే విషయాన్ని తెలియజేయాలి. తద్వారా పిల్లలు చెప్పే విషయాన్ని వారి దృక్కోణం నుంచే పేరెంట్స్ అర్థం చేసుకున్నారని(మీరు ఏకీభవించనప్పటికీ) భావిస్తారు.
* అందరి ముందు శిక్షించకూడదు :
తోబుట్టువుల మధ్య వివాదం తలెత్తినపుడు తప్పకుండా శిక్షించాల్సిన అవసరం ఉంటే అందరిముందు అలా చేయకూడదు. ఇలా చేస్తే తోబుట్టువుల ముందు ఇబ్బందిపడతారు. ఇది శత్రుత్వానికి దారితీయొచ్చు. శిక్ష అనేది గుణపాఠం చెప్పడానికే కానీ అందరికీ ప్రకటించడానికి కాదు.
* ఫ్యామిలీ గ్యాదరింగ్స్ :
ఫ్యామిలీ గ్యాదరింగ్ ఏర్పాటు చేసి అందరినీ సంభాషణలో భాగం చేయాలి. ఈ మేరకు ప్రతి ఒక్కరు తమను తాము వ్యక్తపరచవచ్చు. అంతేకాదు ఇంట్లో ప్రతి ఒక్కరు పాటించాల్సిన నియమాలను రూపొందించేందుకు ఇదొక చక్కటి అవకాశం. హ్యాపీ, హెల్తీ ఫ్యామిలీ నిర్వహణకు సంబంధించి ప్రతి ఒక్కరికీ తమ అంకితభావాన్ని గుర్తు చేసేందుకు వంటగది వంటి బహిరంగ ప్రదేశంలో ఈ నియమాలను ప్రదర్శించాలి.