- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒక కొత్త మొక్కలో గంజాయి సమ్మేళనాన్ని కనుగొన్న సైంటిస్టులు
దిశ, ఫీచర్స్ : ఒక సాధారణ బ్రెజిలియన్ ప్లాంట్‌లో సైంటిస్టులు సీబీడీ(CBD)అని పిలువబడే కన్నాబిడియోల్ సమ్మేళనాన్ని కనుగొన్నారు. ఇది వైద్య రంగంలో జనాదరణ పొందిన ఒక పదార్థాన్ని ఉత్పత్తి చేయడానికి దోహదం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ముఖ్యంగా దక్షిణ అమెరికాలో ఎక్కువగా పెరిగే ‘ట్రెమా మైక్రోంత బ్లూమ్’ పొదలను కలుపు మొక్కలుగా పరిగణిస్తుంటారు. అయితే రియో డి జనీరోలోని ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులర్ బయాలజిస్ట్ రోడ్రిగో మౌరా నెటో ఆధ్వర్యంలోని సైంటిస్టులు ఈ మొక్కలోని పండ్లు, పువ్వుల్లో గంజాయి మొక్కలో ఉండే సమ్మేళనాలు ఉన్నట్లు గుర్తించారు. వైద్య రంగంలో మూర్ఛ, దీర్ఘకాలిక నొప్పి, యాంగ్జయిటీ వంటి పరిస్థితులకు చికిత్స చేయడానికి ఈ సమ్మేళనాలు(cannabidiol) ఉపయోగపడుతాయని భావిస్తున్నారు.
Read More: శ్వాస కోశాల్లో నిక్షిప్తమవుతున్న మైక్రోప్లాస్టిక్స్.. అధ్యయనంలో వెల్లడి