- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎనర్జీ డ్రింక్స్ తాగితే నిజంగానే బలం వస్తుందా?.. నిపుణులు ఏం చెప్తున్నారు?
దిశ, ఫీచర్స్ : ‘మీరు బాగా అలసిపోయారా? వెంటనే శక్తిని పొందాలంటే ఫలానా ఎనర్జీ డ్రింక్స్ తాగండి’ అనే అడ్వర్టైజ్‌మెంట్స్ టీవీల్లో, ఇంటర్నెట్‌లో మనం తరచుగా చూస్తుంటాం. అయితే ఇవి నిజంగానే పనిచేస్తాయా.. లేదా? అని ఎప్పుడైనా ఆలోచించారా? కానీ నార్వేకు చెందిన పరిశోధకులు అదే చేశారు. అవి వ్యక్తుల ఆరోగ్యంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయో పరిశీలించి అసలు విషయాలు బయట పెట్టారు.
తక్షణ శక్తిని అందిస్తాయని చెప్పే పానీయాలు వినియోగదారుల హెల్త్‌పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయో రీసెర్చర్స్ గమనించారు. అధ్యయనంలో భాగంగా తరచుగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే అలవాటు కలిగిన 18 నుంచి 35 ఏళ్ల వయస్సు గల మొత్తం 53,265 మందిని పరిశీలించారు. ఇందులో స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా తేలిందేమిటంటే ఎనర్జీ డ్రింక్స్ తక్షణ ఉపశమనం కలిగించిన భావనకు గురిచేస్తాయి తప్ప వాస్తవానికి శరీరానికి అవసరమై శక్తిని ఇవ్వలేవు.
ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడంవల్ల ఎటువంటి దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని నిపుణులు చెప్తున్నారు. అంతేకాకుండా వీటిలో షుగర్ కంటెంట్, విటమిన్స్, మినరల్స్‌తో పాటు కెఫీన్ కూడా అధికంగా ఉంటుంది. ఒక లీటరుకు పానీయంలో యావరేజ్‌గా 150 మి.గ్రా. కెఫీన్ ఉంటుంది. ఇది స్లీప్ క్వాలిటీని తీగ్గించడం ద్వారా నిద్రలేమి సమస్యకు కారణం అవుతుందని, క్రమంగా ఇన్ సోమ్నియాకు దారితీస్తుందని, దీర్ఘకాలంపాటు ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం గుండె జబ్బులకు కారణం కావచ్చునని పరిశోధకులు పేర్కొన్నారు.