- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొదటి ఏడాదిలో ఆడబిడ్డ కంటే మగ శిశువులే ఎక్కువ మాట్లాడుతారు.. తర్వాత తారుమారు
దిశ, ఫీచర్స్ : చిన్నారుల యాక్టివ్‌నెస్, ప్రవర్తన, కేరింతలను మీరెప్పుడైనా ప్రత్యేకంగా గమనించారా? ఏడాదిలోపు పిల్లలను కదిలించినప్పుడు వారితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, మాటలు రాకపోయినా వారు ఏదో పలకడానికి ట్రై చేస్తుంటారు. ‘మమ, దద, గగ, బబ, అగా... ’ వంటి శబ్దాలను పలుకుతూ కేరింతలు కొడుతూ ఆకట్టుకుంటారు. అయితే చిన్నప్పుడు అసంపూర్తి పదాలు పలికినా పెద్దయ్యాక స్పష్టంగా పలకడం, మాట్లాడటం నేర్చుకుంటారు.
ఇది మన పూర్వీకుల నుంచి అభివృద్ధి చెందిన భాషా క్రమానికి నిదర్శనమని సైంటిస్టు చెప్తున్నారు. భాషా పరిణామం గురించి తెలుసుకునేందుకు చేసిన అధ్యయనంలో భాగంగా పరిశోధకులు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే.. మగ, ఆడ శిశువుల శబ్దాల పరిమాణంలో అసమాతలు ఉంటాయని, సాధారణంగా మొదటి సంవత్సరంలో ఆడ శిశువుల కంటే మగ శిశువులు ఎక్కువగా ‘మాట్లాడతారు’ అని కనుగొన్నారు.
ఇది నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే భాషలో మగవారి కంటే, ఆడవారికే ఈ విధమైన భాషా సామర్థ్యం అధికంగా ఉంటుందని తాము ఊహించామని టేనస్సీలోని మెంఫిస్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు డి.కింబ్రో ఒల్లెర్ తెలిపారు. కానీ మొదటి సంవత్సరంలో ఆడబిడ్డ కంటే మగ శిశువు ఎక్కువ ప్రసంగం వంటి స్వరాన్ని ప్రొడ్యూస్ చేస్తారని నిరూపితమైందన్నారు.
అయితే లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌లో మగ శిశువుల స్పష్టమైన ప్రారంభ ప్రయోజనం అయితే కొనసాగదు. మొదటి సంవత్సరంలో అబ్బాయిలు హయ్యర్ వోకలైజేషన్ చూపించగా, బాలికలు రెండవ సంవత్సరం చివరి నుంచి ఇందులో ప్రతిభ కలిగి ఉంటారు. పరిశోధకుడు ఒల్లెర్, తన సహచరులు భాషలో లింగ వ్యత్యాసాన్ని కనుగొనాలని ఈ పరిశోధన చేయలేదు. వారి ప్రైమరీ ఇంట్రెస్ట్ అంతా బాల్యంలో భాష యొక్క మూలాలు తెలుసుకోవడమే.
కానీ పరిశోధన లోతుల్లోకి వెళ్లాక ఈ విషయం తెలిసిందని చెప్తున్నారు. న్యూ స్టడీలో భాగంగా పరిశోధకులు ఐపాడ్ పరిమాణంలో ఉన్న ఒక డివైస్‌ను ఉపయోగించి 5,899 మంది మగ, ఆడ శిశువుల స్వరాలను 4,50,000 గంటల కంటే ఎక్కువసేపు రికార్డు చేశారు. ఆ రికార్డింగ్‌లు జీవితంలోని మొదటి రెండేళ్లలో శిశువుల మాటలను విశ్లేషించారు. భాషా అభివృద్ధిపై తాము నిర్వహించిన అదిపెద్ద శాంపిల్స్ కలిగిన అధ్యయనంగా దీనిని పరిశోధకులు పేర్కొన్నారు.
మొత్తం మీద మగ శిశువులు ఆడవారితో పోలిస్తే మొదటి సంవత్సరంలో 10% ఎక్కువ ఉచ్ఛారణలు, వివిధ శబ్దాలు పలికారని కనుగొన్నారు. మగ శిశువులు సాధారణంగా మరింత యాక్టివ్‌గా ఉండటం వల్ల వారు ముందుగానే ఎక్కువ స్వరంతో ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. కానీ మగ శిశువులలో పెరిగిన స్వరాలు 16 నెలలకు తగ్గిపోతాయట. శిశువులు తమ ఆరోగ్యాన్ని వ్యక్తీకరించడానికి, మనుగడలో వారి సొంత అసమానతలను మెరుగుపర్చడానికి ప్రారంభంలోనే చాలా శబ్దాలు చేస్తారనే పరిణామ సిద్ధాంతంతో ఇది సరిపోలుతుందని పరిశోధకుడు ఒల్లెర్ పేర్కొన్నాడు.