- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Relationship Tips : ఆ సమయంలో ఈ విషయాలు మాట్లాడితే జీవితం నాశనమే!
దిశ, ఫీచర్స్ : కొన్ని మాటలు మనిషిలో ఆనందాన్ని కలిగిస్తాయి. మరి కొన్ని ఆవేశాన్ని రగిలిస్తాయి. కొన్ని మాటలు మనిషిలో ఉత్సాహం నింపుతాయి. మరికొన్ని నిరుత్సాహానికి గురిచేస్తాయి. కొన్ని మాటలు బంధాలను బలోపేతం చేస్తాయి. మరికొన్ని సంబంధాలను విచ్ఛిన్నం చేస్తాయి. అందుకే నోరు జాగ్రత్త అంటుంటారు పెద్దలు. నిపుణులూ అదే చెప్తు్న్నారు. మీ మాట తీరును బట్టే మీ జీవితం సవ్యంగానో, సమస్యాత్మకంగానో మారవచ్చు. క్షణికావేశంలోనో, ఉద్దేశ పూర్వకంగానో మాట్లాడే మాటలు పార్ట్‌నర్స్ మధ్య వివాదాలకు, కొన్నిసార్లు విడాకులకు, తీవ్రమైన నిర్ణయాలకు దారితీయవచ్చు. అందుకే రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు మీ ప్రియమైన వారితో కొన్ని మాటలు మాట్లాడకపోవడం మంచిదంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
ఐ డోంట్ కేర్
ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది అంటారు కదా.. అలాగే కొన్ని మాటలు సరదాకు అన్నా, కోపంలో అన్నా వాటి ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉండవచ్చు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో గొడపడ్డ ప్రతీసారి ‘ఐ డోంట్ కేర్’ అనే మాటను యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఇది అవతలి వ్యక్తిని అవమానానికి గురిచేస్తుంది. అగౌరవ పరుస్తుంది. ఆత్మ విశ్వాసంపై దెబ్బకొడుతుంది. తరచూ ఈ పదం వాడితే అవతలి వ్యక్తి మనసు విరిగిపోయే అవకాశ ఎక్కువ, అది బంధంలో విచ్ఛిన్నానికి దారితీస్తుంది అంటున్నారు నిపుణులు.
అంతా నీవల్లే..
జీవితమన్నాక పొరపాట్లు సహజం. దాదాపు ఎవరూ కావాలని తప్పు చేయాలనుకోరు. సంబంధాల్లోనూ అంతే.. మీ భాగస్వామి కావాలని తప్పు చేయకపోవచ్చు. ఏదో అనుకోకుండా ఒకసారి జరిగే పొరపాటును సాకుగా తీసుకొని పదే పదే గుర్తు చేయకండి. అంతా నీవల్లే ప్రాబ్లం అంటూ నిందించకండి. ఎందుకంటే ఈ మాటతో అవతలి వ్యక్తి మనసు గాయపడుతుంది. మీపై ద్వేషం పెరుగుతుంది. చివరికి బంధం విచ్ఛిన్నానికి దారితీస్తుంది. అర్థం అయ్యేలా వివరించే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు కోపంలో ఉంటే.. ఆ పరిస్థితిని డైవర్ట్ చేయండి. తర్వాత అన్నీ సర్దుకుంటాయి అంటున్నారు నిపుణులు.
డివోర్స్ ఇచ్చేస్తా..
దంపతులు అన్నాక చిన్న చిన్న తగాదాలు కామన్. కానీ కోపం వచ్చిన ప్రతీసారి ‘మనకు సెట్ అవ్వదు. విడాకులే కరెక్ట్. నీకు డివోర్స్ ఇచ్చేస్తా’’ అనే పదాలను పదే పదే యూజ్ చేయకూడదని రిలేషన్‌షిప్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిపుణులు అంటున్నారు. కోపంలోనో, ఆవేశంలోనో మీరు అంటే అనొచ్చు కానీ.. ఈ పదం మీ జీవిత భాగస్వామిలో అభద్రతా భావాన్ని పెంచుతుంది. చివరికి సంబంధం బీటలు వారేందుకు కారణం అవుతుంది.
మాజీతో పోల్చడం
జీవిత భాగస్వామిని మీ మాజీ ప్రియురాలు లేదా ప్రియుడితో పోల్చడం అవతలి వ్యక్తి అవమానకంగా వ్యక్తి ఫీల్ అవుతారు. పైగా ఇలా పోల్చుతూ.. నువ్వు అలా నువ్వు లేవంటూ అవమానించడం, సూటి పోటి మాటలతో వేధించడం నేరపూరిత స్వభావం కిందికి వస్తుందని నిపుణులు అంటున్నారు. భారత దేశంలో అయితే మహిళల నుంచి ఇలాంటి మాటలు వినడవు. కానీ పురుషులు తమ మాజీ లవర్‌తో పోల్చి భార్యలను అవమానించే సందర్భాలు అక్కడడక్కడా జరుగుతుంటాయని నిపుణులు అంటున్నారు. అయితే ఇలా పోల్చడం ఏ సంబంధంలోనూ భావ్యం కాదు. సంబంధాలు దెబ్బతింటాయి.
తప్పదు కాబట్టి భరిస్తున్నా
పార్ట్‌నర్స్ గొడవపడ్డప్పుడు లేదా సరదాగా మాట్లాడుతున్నప్పుడైనా సరే మీ భాగస్వామితో ‘‘నేను నిన్ను మొదటి నుంచి ఇష్టపడటం లేదు. నువ్వంటే నాకు ప్రేమలేదు, ఏదో తప్పదు కాబట్టి భరిస్తున్నా’’ అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనవద్దు అంటున్నారు నిపుణులు. ఈ మాట వారి మనసును తీవ్రంగా గాయపరుస్తుంది. తీవ్రమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రేరేపిస్తుంది. బంధాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి ఈ పదబంధాన్ని ఎప్పుడూ వాడకండి.