- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది కుక్కల లైబ్రరీ.. కుక్కలు మాత్రమే వినియోగించుకోవాలి!
దిశ, వెబ్‌డెస్క్ః ఇదేంటీ కుక్కలకు లైబ్రరీ..?! అని కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా.. ఆనందం మనుషులకు మాత్రమేనా, కుక్కలకు కూడా ఉండాలంటూ అమెరికాకి చెందిన ఓ నెటిజన్ ఈ పని చేశాడు. కుక్కల కోసం ప్రత్యేకంగా లైబ్రరీని తయారు చేశాడు.'టోబి ది డాగ్' అనే ప్రొఫైల్ ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ ఒక చెక్క పెట్టెలో చిన్న లైబ్రరీ ఫోటోను చూపిస్తుంది. "మా పరిసరాల కోసం కుక్కల లైబ్రరీని తయారు చేసాము. కానీ పుస్తకాలకు బదులుగా, అది బొమ్మలు, కర్రలతో నిండి ఉంటుంది. అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను' అని దాని ప్రత్యేకతలు కాస్త వివరించాడు. లైబ్రరీపై ఒక చిన్న సంకేతం కూడా ఉంది. "ఒకటి తీసుకోండి, ఒకటి వదిలివేయండి" అని రాసి ఉంది. నిజంగా, కుక్కలకున్న చాలా అలవాట్లలో ఈ లైబ్రరీ అలవాటు కూడా సక్రమంగా చేయగలిగితే, ఈ లైబ్రరీ ఒక ట్రెండ్ సెట్టర్ అవుతుంది. ఇక, ఈ పోస్ట్‌కి 20వేలకు పైగా లైక్‌లు, టన్నుల కొద్దీ స్పందనలు వచ్చాయి. ప్రజలు ఈ క్యూట్ లైబ్రరీకి బాధ్యత వహించే డాగ్గో 'లైబ్రేరియన్'ను కూడా ప్రశంసించారు. చాలా మంది తమ ఫర్‌బేబీలతో ప్రత్యేక లైబ్రరీని సందర్శించాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
made a dog library for our neighborhood. but instead of books, it's filled with toys and sticks. i hope everyone likes it. #spreadjoy #dogsoftwitter #dogtwitter #seniordog #sundayvibes pic.twitter.com/MTVJiOhXpB
— Toby the dog (@fulcandles) June 26, 2022