Potassium deficiency : శరీరంలో పొటాషియం లోపమా..? తర్వాత జరిగేది ఇదే..

by Javid Pasha |   ( Updated:2024-10-06 12:43:12.0  )
Potassium deficiency : శరీరంలో పొటాషియం లోపమా..? తర్వాత జరిగేది ఇదే..
X

దిశ, ఫీచర్స్ : ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అన్ని రకాల విటమిన్లు, పోషకాలు, మినరల్స్ అవసరం. కాబట్టి అవి లభించే ఆహారాలను తినాలని డైటీషియన్లు సూచిస్తుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు విటమిన్లు లేదా పోషకాల లోపం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా శరీరంలో పొటాషియం లోపిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* నిజానికి పొటాషియం శరీరంలో నీటి శాతాన్ని, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. నరాల పనితీరును మెరుగు పరుస్తుంది. అయితే బయోటిక్ మందులు అధికంగా వాడటం, పోషకాహారం సరిగ్గా తినకపోవడం వంటి కారణాలతో ఇది లోపించవచ్చు. అధికంగా చెమటలు పట్టడం, తరచుగా నీరసించి పోవడం, మానసిక ఒత్తిడి పెరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది గుర్తిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.

* పొటాషియం లోపించినప్పుడు కనిపించే మరో అనారోగ్య లక్షణం కాళ్లు, చేతులు, భుజాలు, మెడలు వంటి భాగాల్లో తిమ్మిర్లు పట్టడం. అలాగే ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లా్ల్సి రావడం, కండరాల నొపపి, చిరాకు, విసుగు వంటివి కూడా పొటాషియం లోపించిన సంకేతాలుగా భావించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే దానిని భర్తీ చేసే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా అవకాడో, పాలకూర, అరటిపండ్లు, అనపకాయ సీడ్స్, కోకోనట్ వాటర్ వంటివి పొటాషియం లోపాన్ని భర్తీ చేస్తాయి.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించడం లేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed