G20 సమ్మిట్‌ వేదికలో నటరాజ విగ్రహాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ

by Shiva |
G20 సమ్మిట్‌ వేదికలో నటరాజ విగ్రహాన్ని షేర్ చేసిన ప్రధాని మోదీ
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్ లో జరుగుతున్న G20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ 'X' లో సదస్సు వేదికను షేర్ చేశారు. ఆ చిత్రంలో వివిధ రంగులతో తేజోవంతం వెలుగుతున్న నటరాజ విగ్రహం ఉంది. అదేవిధంగా త్రివర్ణ పతాకంతో ఉన్న తన ప్రొఫైల్ పిక్ ను చేంజ్ చేసి ఆయన సమస్కారం చేస్తున్న ఫొటోను డీపీగా ఉంచారు. అయితే, G20 శిఖరాగ్ర సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో కొనసాగనుంది. ఈ సమ్మిట్ కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడా, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.





Advertisement

Next Story

Most Viewed