- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Beet root for skin : బీట్‌రూట్‌ని ఇలా వాడారంటే.. చర్మం మెరిసిపోవాల్సిందే!
దిశ, ఫీచర్స్ : ముఖం లేదా చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి అమ్మాయిలు, అబ్బాయిలు మార్కెట్లో లభించే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ముఖ్యంగా అమ్మాయిలైతే ఎక్కువగా ఫేస్ ప్యాక్‌లు, క్రీములు, లోషన్స్ యూజ్ చేస్తుంటారు. మొటిమల నుంచి జుట్టు సంరక్షణ వరకు కేర్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలా ఖర్చు ఎక్కువయ్యే పద్ధతిలో కాకుండా కేవలం బీట్‌రూట్‌తో అందాన్ని రెట్టింపు చేసుకునే హోమ్ రెమెడీస్ కూడా ఉన్నాయంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు.
బీట్‌రూట్‌తో లాభాలు
బీట్‌రూట్‌లో చర్మాన్ని, జుట్టును అందంగా మార్చగలిగే పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విటమిన్లు, ప్రొటీన్లు, ఫైబర్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఉపయోగించడం ద్వారా చర్మంపై మృతకణాలను తొలగించి, కొత్త కణాల పునరుద్ధరణకు సహాయపడుతుంది. స్కిన్ గ్లోను పెంచుతుంది. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి బీట్ రూట్ ఫేస్‌ప్యాక్ ఎంతో మేలు చేస్తుంది.
నిగారింపు పెరగాలంటే..
చర్మం నిగారింపు పెంచడంలో బీట్‌రూట్ అద్భుతంగా సహాయపడుతుంది. అందుకోసం రోజూ రెండు చెంచాల బీట్‌రూట్ రసాన్ని అదే పరిమాణంలోని పెరుగుతో కలిసి ఫేస్‌కు అప్లై చేయాలి.15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేస్తే నిగనిగలాడుతుంది. అట్లనే రెండు చెంచాల బీట్‌రూట్ రసంలో ఒక స్పూన్ పాలు, రెండు మూడు చుక్కల కొబ్బరి లేదా బాదం నూనె వేసి మిక్స్ చేయాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మంలో గ్లో పెరుగుతుంది. నారింజ తొక్కలను కూడా ఎండబెట్టి, మెత్తాగా నూరి, రెండు చెంచాల ఆరెంజ్ పీల్ పౌడర్, ఒక చెంచా బీట్‌రూట్ జ్యూస్‌తో మిక్స్‌చేసి ముఖానికి అప్లై చేయాలి.15 నిమిషాల తర్వాత నీటితో కడగాలి.
పెదవుల అందానికి
పెదవులపై పగుళ్లు, నలుపు పోవాలంటే బీట్‌రూట్ తురుమనులో కొంచెం పంచదార మిక్స్ చేసి, తర్వాత ఈ స్క్రబ్‌ని పెదాలపై అప్లై చేయాలి. దీంతో డెడ్‌స్కిన్ తొలగిపోయి పెదాలు గులాబీ రంగులోకి మారుతాయి. అలాగే కళ్ల కింద నల్లటి వలయాలు పోవాలంటే.. ఒక చెంచా బీట్‌రూట్ రసంలో కొన్ని చుక్కల బాదం నూనె వేసి, కళ్ల చుట్టూ అప్లై చేసి, స్మూత్‌గా మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు నలుపును పోగొడుతుంది.
జుట్టు ఆరోగ్యానికి
ఒక పాత్రలో రెండు స్పూన్ల బీట్‌రూట్ రసాన్ని తీసుకోవాలి. అందులో వేప ఆకులను ఉడకబెట్టిన నీళ్లను, అరకప్పు మోతాదులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లు లేదా మూలాలపై అప్లై చేసి అరగంటపాటు అలాగే ఉంచాలి. తర్వాత యాంటీ డాండ్రాఫ్ షాంపూతో కడగాలి. వారానికోసారి ఇలా చేస్తే జుట్టు అందంగా మారుతుంది. ఇక జుట్టు రాలే సమస్య ఉన్నవారు ఒక చెంచా కాఫీ పొడిలో బీట్‌రూట్ జ్యూస్ మిక్స్ చేసి తలకు పట్టించాలి. ఈ ప్యాక్‌ను దాదాపు 10 నిమిషాలపాటు అట్లనే ఉంచి శుభ్రంగా కడగాలి. అట్లనే జుట్టు పట్టులా మెరవాలంటే.. రెండు బీట్‌రూట్‌ల రసంలో, కొద్దిగా అల్లం రసం కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇందులో రెండు చెంచాల ఆలివ్ ఆయిల్ వేసి, బాగా మిక్స్ చేసి, జుట్టుకు అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత కడిగేస్తే జుట్టు స్మూత్‌గా మారుతుంది.
Read More...
HMPV virus : కొత్త వైరస్ ప్రాణాంతకమా..? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!