Revanth: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు

by Ramesh Goud |   ( Updated:2025-01-06 13:59:48.0  )
Revanth: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని పేరు
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) కీలక నిర్ణయం(Key Decision) తీసుకుంది. ముఖ్యమంత్రి ప్రారంభించిన ఆరంఘర్ ఫ్లైఓవర్(Aramghar Flyover) కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan Singh) పేరు పెట్టాలని నిర్ణయించింది. ఆరంఘర్ నుంచి జూపార్క్ వరకు 4 కిలోమీటర్ల ఫైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని రెండు అతి పెద్ద ఫ్లైఓవర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

అతి పెద్ద ఫ్లైఓవర్ ను ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభిస్తే.. రెండో అతి పెద్ద ఫ్లైఓవర్ ను నేడు కాంగ్రెస్ ప్రభుత్వలో త్వరతగతిన పూర్తి చేసి, ప్రారంభించుకున్నామని తెలిపారు. ఈ ఫ్లైఓవర్లు రెండు కూడా ఎయిర్ పోర్టుకు వెళతాయని, ఒక ఫ్లైఓవర్ కి మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు పేరు పెట్టుకున్నామని, ఈ ఫ్లైఓవర్ కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించామని వెల్లడించారు. అలాగే హైదరాబాద్ నగర అభివృద్ధే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అని, హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Advertisement

Next Story