- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రంగాపూర్ జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
దిశ, అచ్చంపేట : జిల్లాలోని అచ్చంపేట మండలం రంగాపూర్ జాతర సందర్భంగా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధికారులకు సూచించారు. హిందూ ముస్లింలు నిర్వహించే గంధం ,ప్రభ ఉమామహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు చేయడంతో పాటు..జాతరకు సంబంధించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాబ్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..ఈనెల 15 నుండి 22 వరకు జరిగే రంగాపూర్ జాతరకు వచ్చే భక్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచినీటి సౌకర్యం, రవాణా ట్రాఫిక్, టాయిలెట్స్ మొదలైనవి ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో మాధవి, డిఎస్పి శ్రీనివాసులు, ఉమామహేశ్వర దేవస్థాన కమిటీ చైర్మన్ బి మాధవరెడ్డి, దర్గా కమిటీ చైర్మన్ మహ్మద్ రఫీ , సిఐ రవీందర్, ఎస్సైలు రంగాపూర్ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, ముస్లిం మైనార్టీ నాయకులు, రంగాపూర్ గ్రామ దర్గా తండా నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.