Brinjal: ఆ సమస్యలు ఉన్నవారు వంకాయలు అస్సలు తినొద్దు!

by Prasanna |
Brinjal: ఆ సమస్యలు ఉన్నవారు వంకాయలు అస్సలు తినొద్దు!
X

దిశ, వెబ్ డెస్క్ : వంకాయ పేరు వినగానే ఎంతో మంది.. ఆ రోజు తినడమే మానేస్తారు. మరి కొందరూ చాలా ఇష్టంగా తింటారు. మన ఇళ్లల్లో ప్రతీ పెరట్లో ఇప్పటికి ఈ చెట్టు ఉంటుంది. ఈ కూరగాయతో ఎక్కువగా కూర, కారం చేసుకుని తింటారు. వంకాయకి ఆ సీజన్ .. ఈ సీజన్ అని ఏం లేదు .. ఏడాది మొత్తం దొరుకుతుంది. చలికాలంలో దీన్ని చాలా మంది తింటారు. ఎందుకంటే ఇది బ్లడ్ లో చక్కెరను నియంత్రించగలదు.. అలాగే గుండె జబ్బులు రాకుండా చూసుకుంటుంది. అయితే, ఈ అనారోగ్య సమస్యలతో బాధ పడేవారు వంకాయలను దూరం పెట్టాలి. ఎలాంటి వారు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మ అలెర్జీ : దురదలు, స్కిన్ అలెర్జీ ఉన్న వారు వంకాయతో చేసిన వంటకాలను తినకూడదు. లేకపోతే వారి అలెర్జీ ఇంకా పెరుగుతుంది.

డిప్రెషన్ : డిప్రెషన్‌తో బాధపడేవారు కూడా ఈ కూరగాయను తినకూడదు. ఈ సమస్య ఉన్నవారు మందులు ఎక్కువగా తీసుకుంటారు. వంకాయ శరీరానికి చేరి, మందుల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

రక్తం లేకపోవడం: రక్తం తక్కువగా ఉండేవారు వంకాయను తీసుకోకూడదు. ఎందుకంటే ఇది శరీరంలో రక్తం ఏర్పడే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. ఇది ఎన్నో సమస్యలకు దారి తీస్తుంది.

గ్యాస్ సమస్యలు: గ్యాస్ సమస్యలతో బాధ పడేవారు వంకాయను దూరం పెట్టాలి. ముఖ్యంగా, కడుపు నొప్పితో బాధ పడేవారు దీనిని తినకుండా ఉంటేనే మంచిది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed