హైదరాబాద్ : ఆటోకు దారి ఇవ్వలేదని ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడి

by M.Rajitha |
హైదరాబాద్ : ఆటోకు దారి ఇవ్వలేదని ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడి
X

దిశ, వెబ్ డెస్క్ : తనకు దారి ఇవ్వలేదనే కోపంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ పై దాడికి దిగాడు ఓ ఆటో ట్రాలీ డ్రైవర్. ఓయూ పోలీసులు వివరాల ప్రకారం.. కుషాయిగూడ డిపోకు చెందిన బస్ అఫ్జల్ గంజ్ నుండి కుషాయిగూడకు వెళ్తుండగా.. తన ఆటోకు దారి ఇవ్వలేదనే కోపంతో ఆటో ట్రాలీ డ్రైవర్ జాన్.. బస్సును ఆపి డ్రైవర్ మీద దాడికి దిగాడు. ప్రయాణికులు, కండక్టర్ సహాయంతో ఆటో ట్రాలీ డ్రైవర్ ను ఓయూ పోలీసులకు అప్పగించగా.. వారు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ నెల 20న అఫ్జల్ గంజ్ నుండి ఘట్కేసర్ వెళ్తున్న బస్సులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ పై దాడి చేసిన కేసులో జగదీష్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి.. విచారణ చేపట్టారు.

Next Story

Most Viewed