గుంతలో ఇరుక్కుపోయిన కేంద్ర మంత్రి కారు.. చేసేదేమీ లేక.. వర్షంలోనే..

by Ramesh N |
గుంతలో ఇరుక్కుపోయిన కేంద్ర మంత్రి కారు.. చేసేదేమీ లేక.. వర్షంలోనే..
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ జార్ఖండ్ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం బహరగోరాలో జరిగే ర్యాలీ కోసం వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా బురదలో కూరుకుపోయింది. అయితే రోడ్డుపై గుంతలో ఇరుక్కుపోయిన కారును బయటకు తీయడానికి డ్రైవర్ తీవ్రంగా ప్రయత్నం చేశాడు. అప్పటికే వాహనం ఒకవైపు వంగి పోయినట్టు ఉంటుంది. ఒక వైపు భారీ వర్షం.. మరోవైపు వాహనం కదలకపోవడంతో చేసేదేమీ లేక.. మంత్రి భద్రతా సిబ్బంది గొడుగు పట్టి కారు నుంచి కిందకు దించుతారు.

అనంతరం భారీ వర్షంలోనే మంత్రి యాత్రను కంటిన్యూ చేశారు. కాగా, త్వరలో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జీగా చౌహాన్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోల్హాన్ డివిజన్ స్థాయిలో పరివర్తన్ యాత్ర ప్రారంభానికి వచ్చారు. ఇంతలో కారు బురదలో కూరుకుపోయింది. అయినా కూడా వర్షంలోనే యాత్రను ప్రారంభించి కార్యకర్తలను ఉత్సాహ పరిచారు.

కాగా, బురుదలో కారు ఇరుక్కుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ గుంతలు పడ్డ రోడ్లన్నీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో వేసినవేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అమెరికా రోడ్లని అన్నారు.. ఇప్పుడైనా పరిస్థితి మంత్రికి తెలిసి వచ్చి ఉంటుందని కొందరు నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.

Next Story

Most Viewed