- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
EARTH - MASS EXTINCTION : మరోసారి భూమిపై భారీ మొత్తంలో అంతరించిపోనున్న జీవులు.. ఇప్పటికే రెండు సార్లు ఇదే టైంలో జరిగిందా??
దిశ, ఫీచర్స్ : భూమి భ్రమించే వేగం తగ్గిపోవడాన్ని మరోసారి గ్రహంపై జీవులు అంతరించేందుకు సంకేతంగా పరిగణిస్తున్నారు శాస్త్రవేత్తలు. చెంగ్డు యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెడిమెంటరీ జియాలజీకి చెందిన మా చావో నేతృత్వంలో పరిశోధన జరగ్గా.. ఫ్రెంచ్, జర్మన్, ఐరిష్ శాస్త్రవేత్తలు సహకారం అందించారు. గతంలో రెండు సార్లు ఇలా భూమి వేగం మందగించినప్పుడు భారీ మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. 650-500 మిలియన్ సంవత్సరాల క్రితం ఒకసారి.. 350-200 మిలియన్ ఏళ్ల క్రితం మరోసారి ఇలా భారీ సంఖ్యలో జీవులు అంతరించిపోయాయని తెలిపారు.
తొలిసారి క్షీణత కాంబ్రియన్ పేలుడుకు సమానమైన సమయాన్ని కలిగి ఉండగా.. ఈ టైంలో సముద్రకూర్పులో వేగవంతమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సముద్రాలను మరింత నివాసయోగ్యంగా మార్చాయి. ఇక రెండోసారి భూమి వేగం తగ్గడం.. పెర్మియన్ - ట్రయాసిక్ విలుప్త సంఘటనకు అనుగుణంగా ఉంది. దీనిని గ్రేట్ డైయింగ్ అని కూడా పిలుస్తుండగా.. భూమిపై దాదాపు 90శాతం జీవులు అంతరించిపోయాయి.