Love and Breakup : లవరే కదా అని అలాంటి మెసేజ్‌లు చేస్తే.. నెక్ట్స్ సీన్ ఇదే!

by Javid Pasha |   ( Updated:2024-10-18 14:39:31.0  )
Love and Breakup : లవరే కదా అని అలాంటి మెసేజ్‌లు చేస్తే.. నెక్ట్స్ సీన్ ఇదే!
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు ప్రేమంటే.. ఏ కాలేజీలోనో, బస్టాపులోనో, సుదీర్ఘ పరిచయం తర్వాతో పుట్టేదని చెప్తారు. కానీ ఇప్పుడంత రిస్క్ అవసరం లేదు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లోనూ ప్రేమలు చిగురిస్తు్న్నాయ్. హాయ్.. హలో మాటలతో ప్రారంభమైన పరిచయాలు కాస్త.. లవ్ ప్రపోజల్స్ దాకా వెళ్తున్నాయ్.. ఇదంతా పక్కన పెడితే సాధారణంగా ప్రేమికులు డైలీ మెసేజ్‌లు చేసుకోవడం ఈ రోజుల్లో చాలా కామన్. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మెసేజ్‌లే వారిలో ప్రేమ వైఫల్యాలనికి లేదా బ్రేకప్‌లకు కారణం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. అలాంటి విషయాలేమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచిస్తున్నారు.

కారణాలేమైనా ప్రస్తుతం చాలా మంది లవర్స్ కాల్ చేసి మాట్లాడుకోవడం కంటే.. ఛాటింగ్‌లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. ప్రేమికుల్లో సహజంగానే ఒక విధమైన భావోద్వేగ సంబంధం ఉంటుంది. ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలనే తపన కనిపిస్తుంది. ఇక్కడే కొందరు పొరపాట్లు చేస్తున్నారు. అవతలి వ్యక్తిపై అతి ప్రేమ లేదా ఇంకేదో తెలుసుకోవాలన్న తపన కాస్త వ్యసనంగా మారుతోంది. ఛాటింగ్ చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తిని ఏం అడగాలో, ఏ విషయాలు వారిని హర్ట్ చేస్తాయో అని కూడా ఆలోచించకుండా ఠక్కుమని ఓ మెసేజ్ పెట్టేయడం చేస్తుంటారు. కానీ ఇదే కొందరి విషయంలో మనస్పర్థలకు, బ్రేకప్‌లకు దారితీస్తోంది. కాబట్టి మీరు చేసే మెసేజ్ మీ లవర్ మనో భావాలు దెబ్బతినకుండా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

కొన్నిసార్లు మీరు మెసేజ్ చేస్తారు. అవతలి వ్యక్తి నుంచి వెంటనే రిప్లై రాకపోతే ఏవైనా కారణాలు ఉండవచ్చు. కానీ ఇది అర్థం చేసుకోకుండా క్షణికావేశానికి లోనవుతారు. తర్వాత అనుమానించడం మొదలు పెడతారు. ‘ఎందుకు రిప్లయ్ ఇవ్వలేదు?, ఏం చేస్తున్నావ్..? నాకంటే ముఖ్యమైన పనా?’ అంటూ పదే పదే ప్రశ్నలతో విసుగెత్తిస్తారు. ఈ ధోరణివల్ల అవతలి వ్యక్తి భరించలేక బ్రేకప్ చెప్పేస్తున్న సంఘటనలో ఈ రోజుల్లో చాలానే జరుగుతున్నాయని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి అనవసర తాపత్రయాలు, ఆందోళనలు, అనుమానాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

ప్రేమికులు ఛాటింగ్ సందర్భంగా తమ ఫీలింగ్స్, ఆలోచనలు వ్యక్తీరించేందుకు ఎమోజీలు పంపుతుంటారు. మీరు అదే చేస్తుంటే గనుక జాగ్రత్త. ఎందుకంటే మీ ప్రియురాలు లేదా ప్రియుడి మనస్సును హర్ట్ చేసేవి ఉంటే గనుక వెంటనే అవతలి వ్యక్తి బ్రేకప్ నిర్ణయం తీసుకోవడం ఈ రోజుల్లో పెద్ద విషయం కాదు. కాబట్టి ఎదుటి వారి మనోభవాలను పట్టించుకోకుండా అపార్థాలు, పెడర్థాలకు దారితీసే ఎమోజీలు పంపితే చిక్కుల్లో పడతారు. మొత్తానికి ఇద్దరికీ నచ్చే బెస్ట్ అండ్ స్వీట్ కమ్యూనికేషన్ ఉండాలి తప్ప ఛాటింగ్‌లోనూ మీ వన్‌సైడ్ నియంతృత్వాన్ని ప్రదర్శిస్తే అవతలి వ్యక్తి నుంచి ‘బ్రేకప్’ అనే రిప్లయే వస్తుంది మరి!

Advertisement

Next Story

Most Viewed