Loneliness: లోన్లీనెస్‌తో పెరుగుతున్న రిస్క్.. దీర్ఘకాలం కొనసాగితే చివరికి !

by Javid Pasha |
Loneliness: లోన్లీనెస్‌తో పెరుగుతున్న రిస్క్.. దీర్ఘకాలం కొనసాగితే చివరికి !
X

దిశ, ఫీచర్స్ : లోన్లీనెస్.. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అనేకమందిని వేధిస్తున్న మానసిక అనారోగ్యాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇక్కడ సింగిల్‌గా ఉంటం వేరు. లోన్లీగా ఉండటం వేరని గుర్తుంచుకోవాలి. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నంత మాత్రాన లోన్లీగా ఫీల్ కాకపోవచ్చు. అదే మ్యారేజ్ అయిన వ్యక్తి లేదా నలుగురితో కలిసి మెలిసి ఉండే వ్యక్తి చుట్టూ అందరూ ఉన్నా మనసులో మాత్రం ‘లోన్లీనెస్’ భావాలతో ఇబ్బంది పడుతుండవచ్చు. అయితే ఒంటరితనంతో ఇబ్బంది పడేవారు ఆ సమస్య నుంచి త్వరగా బయటపడకపోతే ప్రమాదకర వ్యాధులు, అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుందని ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జెరియాట్రిక్ సైకియాట్రీ’ స్టడీలో వెల్లడైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

* టైప్ -2 డయాబెటిస్ : లోన్లీనెస్ వల్ల మెంటల్ డిజార్డర్స్ మాత్రమే కాదు, శారీరక అనారోగ్యాలకూ అది దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలం పాటు ఒంటరితనంతో కుంగిపోయే వారిలో టైప్ -2 డయాబెటిస్ ప్రమాదం రెట్టింపు అవుతుందని యూరోపియన్ అసోసియేషణ్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ జర్నల్ కూడా పేర్కొన్నది.

* మెదడు సామర్థ్యం తగ్గుతుంది : తరచుగా ఒంటరితనంతో బాధపడే వ్యక్తుల్లో మెదడు సామర్థ్యం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు. జ్ఞాపక శక్తి క్షీణించే అవకాశం ఉందని కూడా ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ జెరియాట్రిక్ సైకియాట్రిటీ అధ్యయనం పేర్కొన్నది. లోన్లీనెస్, సోషల్ ఐసోలేషన్ వంటి మానసిక సమస్యల కారణంగా అల్జీమర్స్ వచ్చే చాన్స్ కూడా ఉంది.

* ముందస్తు వృద్ధాప్యం : ఎక్కువ కాలంపాటు లోన్లీనెస్ అనుభవించే వ్యక్తుల్లో వృద్ధాప్యం త్వరగా వస్తుందని పలు అధ్యయనాలు ఇప్పటికే పేర్కొన్నాయి. ఎందుకంటే ప్రతి కూల ఆలోచనలు శరీరంలోని హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపడంవల్ల ఇలా జరుగుతుంది. దీనికి తోడు బాధితుల్లో ధూమపానం, మద్యపానం అలవాట్లు కూడా ఉంటే ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.

* గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ : ఒంటరితనం మానసిక అనారోగ్యమే కావచ్చు. కానీ పరోక్షంగా ఫిజికల్ హెల్త్‌పై ఎఫెక్ట్ చూపుతుంది. దానిని అనుభవించే వ్యక్తి సమయానికి తినకపోవడం, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, రోజువారీ కార్యకలాపాలకు దూరంగా ఉండటంవల్ల పలు సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెప్తున్నారు. అలాగే కొందరు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు అతిగా తినే రుగ్మత బారిన కూడా పడవచ్చు. ఈ పరిస్థితి హార్మోన్ల అసమతుల్యతకు, మధుమేహానికి, అధిక రక్తపోటుకు దారితీస్తుంది. క్రమంగా గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుందని బ్రిటీష్ ఆన్‌లైన్ మెడికల్ జర్నల్ పేర్కొంటున్నది.

* గుర్తుంచుకోండి : గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే.. ఒంటరి తనం లేదా లోన్లీనెస్ అంటే ఒక్కరే ఉండటం కాదు. ఒక వ్యక్తి సింగిల్‌గా ఉన్నా అతను లోన్లీనెస్‌గా ఉండకపోవచ్చు. కొందరు నలుగురిలో ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతుండవచ్చు. అంటే ఇది రకరకాల ప్రభావాల కారణంగా మానసిక భావనలోంచి పుట్టుకొస్తుంది. మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్‌‌పై ప్రభావం చూపుతుంది కాబట్టి ఒంటరితనం లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. సామాజిక పరస్పర చర్యల్లో పాల్గొనడం, పుస్తకాలు చదవడం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో చర్చించడం వంటివి దీనికి చక్కటి పరిష్కారంగా ఉంటాయి. అయినా సమస్య వేధిస్తూనే ఉంటే మానసిక నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే మానసిక నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed