- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిడ్నీ స్టోన్స్ ఎలా కరుగుతాయి..?
దిశ, ఫీచర్స్: మానవ శరీరంలో కిడ్నీలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి రక్తంలో చేరే మలినాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేసి, యూరిన్ రూపంలో బయటకు పంపింగ్ చేస్తాయి. రక్తపోటును కూడా కంట్రోల్ చేస్తాయి. రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్తత్తిని పెంచే హార్మోన్లను కూడా తయారు చేస్తాయి. బాడీలో మినరల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు అందించే కిడ్నీలను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు వైద్య నిపుణులు. కానీ జీవనశైలి ప్రభావం, ఆహారపు అలవాట్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు కారణమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో కిడ్నీ స్టోన్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కిడ్నీ స్టోన్స్ ఏర్పడేందుకు కారణాలేంటి? అనే విషయాల గురించి తెలుసుకుందాం.
స్టోన్స్ ఎలా ఏర్పడతాయి?
కిడ్నీ స్టోన్స్‌లో కాల్షియం అక్సినేట్, కాల్షియం ఫాస్పేట్ కలిగిన రెండు రకాలు ఉంటాయి. యూరిన్‌లో ద్రావణం, సాలిడ్ కంపోనెంట్ ఉంటాయి. సాలిడ్ కంపోనెంట్‌లో సోడియం, పొటాషియం, యూరిక్ యాసిడ్, కాల్షియం వంటి పదార్థాలుంటాయి. సాలిడ్ కంపోనెంట్స్ యూరిన్‌లో కరగకుండా ఉంటే.. చిన్న చిన్న గుళికలుగా మారుతాయి. అవి యూరిన్ ద్వారా బయటకు వెళ్లని సందర్భంలో లోపలే పేరుకుపోవడం వల్ల ఏర్పడే స్ఫటికాలు కిడ్నీల్లో స్టోన్స్‌గా మారుతాయి. ఇవి మూత్రకోశంలో కదులుతుంటాయి కూడా. సాధారణంగా ఆక్జలేట్ లేదా ఫాస్ఫరస్‌లతో కాల్షియం మిక్స్ అవడంవల్ల ఏర్పడే రాళ్లే అధికంగా కనిపిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు. బాడీ ప్రోటీన్స్‌ను వినియోగించుకునే సందర్భంలో వెలువడే యూరిక్ యాసిడ్‌తోనూ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది.
వాటర్ సరిగ్గా తాగకపోతే
శరీరానికి అవసరమయ్యే మొత్తంలో నీళ్లు తాగకపోయినా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాలుంటాయి. వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువగా ఉన్నప్పుడు రాళ్లు ఏర్పడడానికి దారితీసే పదార్థాలు విచ్ఛిన్నం అవుతాయి. అవి తర్వాత యూరిన్‌తో పాటు బయటకు వెళ్తాయి. అందుకే తక్కువ వాటర్ తాగడం కూడా కిడ్నీ స్టోన్స్ ఏర్పడేందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అందుకే రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని డాక్టర్లు చెప్తుంటారు.
కాల్షియం తీసుకోకపోతే
ఆహారం ద్వారా శరీరానికి తగినంత కాల్షియం అందకపోయినా కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ఛాయిస్ ఉంటుంది. కాల్షియం బాగా తగ్గడంవల్ల యూరిన్‌లో ఆక్జలేట్ స్థాయిలు పెరిగి రాళ్లు ఏర్పడొచ్చు. కాబట్టి వయసుకు తగినట్టుగా కాల్షియం తీసుకునేలా చూసుకోవాలి. 50 సంవత్సరాలు పైబడిన పురుషులకు రోజుకు 1000 మి. గ్రా. కాల్షియం అవసరం. అలాగే 800 ఐయూ విటమిన్ డి కూడా తీసుకోవడం బెటర్ అని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో దోహదం చేస్తుంది.
డయాబెటిస్ బాధితుల్లో
డయాబెటిస్ ఉన్నవారిలోనూ కిడ్నీ స్టోన్స్ ఏర్పడే చాయిస్ ఉంటుంది. ఎందుకంటే వీరిలో ఎసిడిక్ యూరిన్ ఉంటుంది. మూత్రంలో యూరిక్ యాసిడ్ అధికంగా చేరితే.. కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు పెరుగుతుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అలాగే సోడియం (ఉప్పు) అధికంగా తీసుకున్నా కిడ్నీ స్టోన్స్ ఏర్పడవచ్చు. శరీరంలో సోడియం స్థాయిలు పెరిగితే.. యూరిన్‌లో కాల్షియం స్థాయిలు కూడా పెరిగేలా చేస్తుంది. అందుకే ఒక వ్యక్తి రోజుకు 2,300 మి.గ్రా. కంటే అధికంగా సోడియం తీసుకోవద్దని నిపుణుల సలహా.
అధిక ప్రోటీన్ల వల్ల
మాంసాహారం ఆరోగ్యానికి మంచిదే కానీ, మరీ ఎక్కువైతే మాత్రం వాటిలోని ప్రోటీన్లను శరీరం అధికంగా గ్రహిస్తుంది. దీని వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉంటుంది. మేక, గొర్రె తదితర జంతువుల మాంసం, చికెన్, గుడ్లు, సముద్రపు రొయ్యలు, చేపల వంటివి స్థాయికి మించి తినడంవల్ల యూరిన్‌లో యూరిక్ యాసిడ్ మోతాదులు పెరుగుతాయి. ఫలితంగా రాళ్లు ఏర్పడే చాయిస్ ఉంటుంది. అలాగే ప్రతిరోజూ మోతాదుకు మించి కాఫీలు, టీలు తాగడం కూడా కిడ్నీ స్టోన్స్‌కు కారణం కావచ్చు. కెఫిన్ కంటెంట్ ఎక్కువ కావడం వల్ల యూరిన్‌లో కాల్షియం పెరిగే అవకాశం ఉంటుంది.
కూల్ డ్రింక్స్, కార్బోనేటేడ్ డ్రింక్స్‌లో ఫాస్పేట్ శాతం అధికంగా ఉంటుంది. ఇది కూడా స్టోన్స్ ఏర్పడేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి శరీరానికి ఏది ఎంత వరకు అవసరమో తెలుసుకొని మసులుకుంటే కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశాలను తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇక స్టోన్స్ ఏర్పడి పెయిన్ రావడం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే మాత్రం తప్పక సర్జరీ అవసరం అవుతుంది. ప్రస్తుతం పెద్దగా రిస్క్ లేకుండా కిడ్నీ స్టోన్స్‌ను విచ్ఛిన్నం చేసే లేజర్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి.
Read more: