- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సమోసా తిన్నవారికి రూ.51 వేలు బహుమతి.. రెడీనా..?! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః సమోసా భారతీయుల వంటకం కాకపోయినప్పటికీ భారతీయతను చుట్టుకొని, ఈ ప్రజలకు అవి సొంతమయ్యాయి. ఇక, మీరు సమోసా ప్రియులైతే భారీ సమోసాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఉన్న ఓ మిఠాయి దుకాణంలో భారీ పరిమాణంలో బాహుబలి సమోసాను విక్రయిస్తున్నారు. 8 కేజీల బరువున్న ఈ సమోసాను ధర రూ. 1100 మాత్రమే. దీని రుచి కూడా అద్భుతంగా ఉంటుందని అంటున్నాయి నివేదికలు. అంతేకాదు, మీరు ఈ సమోసాను పూర్తిగా తినగలిగితే, దీని తయారీ సంస్థ మీరట్‌కు చెందిన కౌశల్ స్వీట్స్ మీకు నగదు బహుమతిని కూడా అందజేస్తుంది. ఎవరైనా దీన్ని 30 నిమిషాల్లో స్వయంగా ఆరగించకలిగితే, వారు రూ. 51,000 గెలుచుకోవచ్చు.
ఈ భారీ సమోసాను తయారు చేయడానికి మొత్తం 30 మంది వ్యక్తులు అవసరమవగా, తయారీకి గంట నుంచి గంటన్నర సమయం పడుతుందని షాప్ యజమాని శుభమ్ కౌశల్ తెలిపారు. ఎనిమిది కిలోల సమోసాలో బంగాళాదుంపలు, బఠానీలు, కాటేజ్ చీజ్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. షాప్ యజమాని శుభం IANSతో మాట్లాడుతూ, "ఈటింగ్ ఛాలెంజ్‌లో ఎవరూ విజయం సాధించలేదు. చాలా మంది ప్రయత్నించారు కానీ చివరి వరకూ వెళ్లలేకపోయారు. మేము ఇప్పుడు 10 కిలోల సమోసాను తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నాము" అని చెప్పారు. అయితే, బాహుబలి సమోసా తన షాప్‌కు కస్టమర్లను తిరిగి తీసుకువచ్చిందని చెప్పాడు. బాహుబలి సమోసాను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫుడ్ బ్లాగర్లు వచ్చి వీడియోలు తయారుచేస్తున్నారని తెలిపారు.