వర్షాకాలంలో ఈ ఆహారాలను తినకపోవడమే మంచిది

by Prasanna |
వర్షాకాలంలో ఈ ఆహారాలను  తినకపోవడమే మంచిది
X

దిశ, ఫీచర్స్: వర్షాకాలం మొదలవ్వగానే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే ఆహారంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, వీటిని దూరం పెట్టాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

చిక్కుళ్ళు పోషకాలతో నిండి ఉన్నాయి. వీటిలో మెగ్నీషియం, జింక్, ఇనుము వంటి వివిధ ఖనిజాలను కూడా అందిస్తాయి. వీటిని తీసుకోవడం వలన శరీరంలో పోషకాల లోపం ఉండదు. అయితే, వర్షాకాలంలో మాత్రం అసలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఫైబర్ పెరగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి. కొంత మంది శనగలు ఉడికించిన తింటుంటారు. వర్షాకాలంలో ఇది తినకపోవడమే మంచిది. ఇవి ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, ఈ సమయంలో వాటిని తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వేధిస్తాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది.‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story