- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పురాతన తవ్వకాల్లో బయటపడిన విత్తనంతో పెంచిన మొక్క.. క్యాన్సర్‌కు నేచురల్ సొల్యూషన్ కానుందా?
దిశ, ఫీచర్స్ : దాదాపు 1,000 సంవత్సరాల క్రితం నాటి ఒక విత్తనం అద్భుతమైన క్యాన్సర్ మందుగా మారింది. బైబిల్ రాణి పేరు మీద "షేబా" అని పేరు పెట్టబడిన ఈ విత్తనం.. 14 సంవత్సరాలు జాగ్రత్తగా సాగు చేసిన తర్వాత ఇప్పుడు దాదాపు 10 అడుగుల పొడవు ఉన్న చెట్టుగా ఎదిగింది. 1980ల చివరలో జుడాన్ ఎడారిలో పురావస్తు త్రవ్వకాలలో ఈ విత్తనం కనుగొనబడగా.. 993 - 1202 CE మధ్య కాలం నాటిదని నమ్ముతున్నారు పరిశోధకులు. బైబిల్ లో పేర్కొనబడిన చెట్టు జాతికి చెందినదని ఊహిస్తున్నారు. ఇప్పుడు అంతరించిపోయింది కానీ ఒకప్పుడు ఆధునిక ఇజ్రాయెల్, పాలస్తీనా, జోర్డాన్‌లకు సంబంధించిన ప్రాంతాలలో ఉండేదని అంచనా వేస్తున్నారు.
ఈ షేబా చెట్టు ఆకులు మంచి ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని గుర్తించారు పరిశోధకులు. దీని రసాయన విశ్లేషణ యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉందని వెల్లడిస్తుంది. పరిశోధకులు ఈ మొక్క రెసిన్ లో గ్లైకోలిపిడ్ సమ్మేళనాల శ్రేణిని గుర్తించారు. ఈ ఆవిష్కరణ పురాతన వైద్య పద్ధతులపై విలువైన అంతర్దృష్టులను అందిస్తుంది.ఇక ఈ చెట్టు కమ్మిఫోరా జాతులతో ముడిపడి ఉందని నమ్ముతున్నారు. ముందుగా ఈ మొక్క చారిత్రాత్మక "జుడియన్ బాల్సమ్"కి మూలం కావచ్చని ప్రాథమిక సిద్ధాంతాలు సూచించినప్పటికీ.. ఆ చెట్టుకు సుగంధ లక్షణాలు లేవని పేర్కొంటూ పరిశోధకులు దీనిని తోసిపుచ్చారు.