Irregular periods: పీరియడ్స్ టైమ్‌కు రావట్లేదా?.. అయితే ఈ ఒక్క డ్రింక్‌తో సమస్యలన్నీ పరార్..

by Kavitha |
Irregular periods: పీరియడ్స్ టైమ్‌కు రావట్లేదా?.. అయితే  ఈ ఒక్క డ్రింక్‌తో సమస్యలన్నీ పరార్..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ప్రతి అమ్మాయికి నెల నెల పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కానీ, కొన్ని అనారోగ్య సమస్యల వల్ల కావొచ్చు, లేదా నేటి జీవనశైలి, ఆహారంలో మార్పుల కారణంగా కావొచ్చు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తుంటాయి. ఒక్కోసారి మూడు నెలల వరకు కూడా రాకుండా ఉంటాయి. దీంతో డాక్టర్ దగ్గరికి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి మెడిసిన్స్ వాడుతుంటారు. ఎక్కువ మందులు వాడకం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ డ్రింక్ తాగడం వల్ల మనీతో పాటు మీ ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది. మరి ఇంతకీ ఆ డ్రింక్ ఏంటిదో మనం తెలుసుకుందాం..

కొందరికి హార్మోన్ల మార్పుల వల్ల పీరియడ్స్ రావడంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అదేవిధంగా ఒత్తిడి, ఊబకాయం, థైరాయిడ్, పీసీఓడీ, గర్భనిరోధక మాత్రలు వేసుకోవడం వల్ల వివిధ కారణాల వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకుండా ఉంటాయి.

అయితే ఇంట్లో లభించే పదార్థాలను ఉపయోగించి ఆ ప్రత్యేక కషాయాన్ని తయారు చేసి తాగవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మరి ఈ డ్రింక్ చేయడానికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం..

1) కావలసిన పదార్థాలు:

*నీరు

*బెల్లం

*అజ్వానా

*అల్లం

*జీలకర్ర

*ఇంగువ

*దాసించెక్క

*పసుపు

2) తయారీ విధానం:

ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్లు పోసి అందులో బెల్లంతో పాటు అల్లం, అజ్వానా, జీలకర్ర, ఇంగువ, చక్కా, పసుపు వేసి బాగా కలపాలి. ఈ పదార్థాలన్నింటినీ పది నిమిషాల పాటు మరిగించాలి. అలా రెండు కప్పుల నీరు ఒక కప్పుకు తగ్గే వరకు మరిగించాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టి గ్లాసులో పోసుకుని ఖాళీ కడుపుతో తాగాలి.

ఇలా రెండు మూడు రోజులు తాగితే పీరియడ్స్ వస్తాయి. పీసీఓడీ, పీసీఓఎస్, సక్రమంగా రుతుక్రమం లేనివారు కూడా దీన్ని తాగవచ్చు. అలాగే పీరియడ్స్‌ సమయంలో కడుపు నొప్పి వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ కషాయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Next Story

Most Viewed