- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కుక్కకున్న బుద్ది వీళ్లకుందా..' ఐపీఎస్ పెట్టిన 'కుక్క వీడియో' హైలెట్!
దిశ, వెబ్‌డెస్క్ః కుక్కలు చాలా తెలివిగల, నమ్మకమైన, బుద్ది జీవులని చాలా మందికి తెలుసు. చాలా సందర్భాల్లో కుక్కలే మానవులకు గుణపాఠాలు నేర్పుతాయనడంలో సందేహం లేదు. దీన్ని బలపరుస్తూ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో కుక్క చేసిన పని చూస్తే మరింత ప్రశంసిస్తారు కూడా! మనుషులు చేస్తున్న తప్పులకు కాలుష్యం పెరిగిపోయి, నానాటికీ అడుగంటిపోతున్న నీరు ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి నీటిని మనుషులు బాధ్యతారాహిత్యంగా వృధా చేస్తుంటే, ఈ వీడియోలో కుక్క మాత్రం ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తుంది. ట్యాప్‌లో నీరు తాగిన తర్వాత కుక్క ట్యాప్‌ను ఆపివేయడం ఎంతో ముచ్చటగా ఉంటుంది. అంతకుమించి, గుణపాఠంలా కనిపిస్తుంది.
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా పోస్ట్ చేయగా లక్షల్లో వ్యూవ్స్, భారీగా కామెంట్లు వస్తున్నాయి. 12-సెకన్ల క్లిప్‌లో నల్ల కుక్క ఒక ట్యాప్‌ని ఓపెన్ చేసి నీరు తాగుతుంది. తర్వాత తన తలతో కుళాయిని ఆపేస్తుంది. దీనికి అదొక అలవాటుగా మారడాన్ని సూచిస్తూ, రెండుసార్లు ఇలా చేస్తుంది. "ప్రతి చుక్క విలువైనది... డాగీకి అర్థమైంది, మనం మనుషులు ఎప్పుడు అర్థం చేసుకుంటాము?" ఐపీఎస్ అధికారి దీపాంషు కబ్రా వీడియోను షేర్ చేస్తూ హిందీలో దీన్ని క్యాప్షన్‌గా రాశారు.
बूँद-बूँद कीमती है...
— Dipanshu Kabra (@ipskabra) July 7, 2022
डॉगी को समझ आ गया, हम इंसान कब समझेंगे? pic.twitter.com/wMoY7QGAnS