Weight Loss: స్వీట్ కార్న్‌ను ఇలా తీసుకుంటే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..

by Kavitha |
Weight Loss: స్వీట్ కార్న్‌ను ఇలా తీసుకుంటే.. బరువు ఇట్టే తగ్గిపోతారు..
X

దిశ, ఫీచర్స్: మనలో చాలా మంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు. బరువు తగ్గడం కోసం వ్యాయామం, డైట్ అని ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయినా కానీ బరువు తగ్గరు. దీంతో డిప్రెషన్‌కు లోనయ్యి సరిగ్గా ఫుడ్ తీసుకొక హార్మొన్ల అసతుల్యత వల్ల ఇంకా లావు అయిపోతారు. అయితే వర్షాకాలంలో దొరికే స్వీట్‌కార్న్‌ను ఇప్పుడు చెప్పే విధంగా తీసుకోవడం వల్ల బరువు ఇట్టే తగ్గిపోతారు. మరి వీటిని ఏ విధంగా తీసుకుంటే లాభాలో ఇప్పుడు మనం చూద్దాం..

స్వీట్ కార్న్‌ను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. సలాడ్ స్నాక్స్ లాగా అనేక ఆహార పదార్థాల్లో కార్న్‌ను ఉపయోగిస్తారు. కానీ దానివల్ల మనం బరువు కూడా తగ్గొచ్చు అని మాత్రం కొంతమందికే తెలుసు.

బరువు తగ్గడానికి మొక్కజొన్న:

మొక్కజొన్నలో నీరు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా పొట్ట ఫుల్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. దీనివల్ల శరీరం క్యాలరీలను తీసుకోకుండా చేస్తుంది. మొక్కజొన్న మన జీర్ణవ్యవస్థకు కూడా చాలా మంచిది.

బరువు తగ్గడానికి మొక్కజొన్నను ఎలా తినాలి?

*వేడి వేడిగా వేయించిన మొక్కజొన్న తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాకపోతే వీటిని బటర్ లేదా డీప్ ఆయిల్‌లో ఫ్రై చేయకుండా తినడం మంచిది. రుచి కోసం సాల్ట్ అండ్ నిమ్మరసం వేసుకోవచ్చు.

*అలాగే ఆవిరిలో ఉడికించిన మొక్కజొన్నలో కొంచెం ఉప్పు, అల్లం వేసి తిన్నా రిజల్ట్స్ మంచిగా ఉంటుంది.

*కార్న్, క్యాప్సికం, స్ప్రింగ్ ఆనియన్స్ వంటి కూరగాయలతో కలిపి ఫ్రై చేసి తిన్నా కూడా బరువు తగ్గడంలో చాలా ఉపయోగపడుతుంది.

*ఇక అన్నం తినేముందు కార్న్ సూప్ తాగడం వల్ల మీరు ఎక్కువగా తినకుండా ఉంటారు. బ్రోకలి, క్యారెట్, బీన్స్ వంటి ప్రోటీన్ లను సూప్‌లో కలపడం ద్వారా పోషక విలువ పెంచవచ్చు. కానీ సూప్‌లో కార్న్‌స్టార్చ్, వెన్న వంటి వాటిని ఉపయోగించవద్దు.

*స్వీట్ కార్న్‌తో ఛాట్, సలాడ్లు, తక్కువ క్యాలరీలున్న ఫ్రిటర్స్ కూడా తయారు చేయవచ్చు. అలాగే పోషక పదార్థాలు ఎక్కువగా ఉండేలా సలాడ్ లేదా బేక్ చేసి స్నాక్స్ లాగా తిన్నా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.

*ఉదయాన్నే కార్న్ ఉప్మా కూడా చాలా పోషకంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాబట్టి మొక్కజొన్నను మీ ఆహారంలో చేర్చుకోండి బరువు సులభంగా తగ్గండి.

నోట్: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే దీనిని అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు సంబంధించి ‘దిశ’ ఎటువంటి బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Next Story

Most Viewed