మీరు పూర్తిగా చీకట్లోనే బతికితే... ఎన్ని గంటలు మేలుకుని ఉంటారో తెలుసా?

by Sujitha Rachapalli |
మీరు పూర్తిగా చీకట్లోనే బతికితే... ఎన్ని గంటలు మేలుకుని ఉంటారో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : 1962లో ఫ్రెంచ్ జియాలజిస్ట్ మిచెల్ సిఫ్రే సెట్ ఆఫ్ ఎక్స్ పరిమెంట్స్ చేశాడు. తనతోపాటు కొంతమంది శాస్త్రవేత్తల బృందం పూర్తిగా చీకటితో కూడిన భూగర్భంలో జీవించడం ఇందులో భాగం. కాగా క్లాక్స్, కాలెండర్స్, అసలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా నెలలపాటు గడిపారు. జస్ట్ చిన్న బల్బు మాత్రం లేచినప్పుడు ఆన్ చేయడానికి, పడుకునేటప్పుడు ఆఫ్ చేయడానికి తీసుకెళ్లారు. దీని ఆధారంగా వారు ఎంతకాలం పడుకుంటున్నారో, ఎప్పుడు లేస్తున్నారో గుర్తించారు.

ఆశ్చర్యకరంగా మన లోపల ఉన్న బయాలాజికల్ క్లాక్ 24 గంటలకు అనుగుణంగా పని చేస్తుందన్న వాస్తవం అబద్ధం అయిపోయింది. చీకట్లో జీవించిన వారు 48 గంటలపాటు వర్క్ చేయగలరని.. 36 గంటలు మెలకువతో ఉండగలరని.. పన్నెండు గంటలపాటు పడుకోగలరని ప్రూవ్ అయింది. ఈ శాస్త్రవేత్త వర్క్ క్రోనోబయాలజీకి పునాది కాగా మన శరీరం, మెదడుపై చీకటి ఎలా ప్రభావం చూపిస్తుందో ఇది వివరిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed