- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Winter Health : ఆరోగ్యానికి మంచిదే.. కానీ చలికాలంలో వీటిని తినకూడదు!
దిశ, ఫీచర్స్ : నిజానికి ఆకు కూరలు ఆరోగ్యానికి మంచిది. విటమిన్లు, ఖనిజాలు, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆహారంలో భాగంగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అయితే శీతాకాలంలో మాత్రం కొన్నింటిని తినకపోవడమే బెటర్ అని కూడా అంటున్నారు. అలాంటి ఆకుకూరలేవి? తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
* బచ్చలి కూర : ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంవల్ల సాధారణ సమయాల్లో బచ్చలి కూడార తినడం ఆరోగ్యానికి మంచిదే. అయితే ఫోలెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో కొందరికి ఇబ్బందిగా మారవచ్చు. ఫిజికల్ యాక్టివిటీస్ తక్కువగా ఉండటం, అజీర్తి వంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు వింటర్‌లో దీనిని తింటే అలెర్జీలు వచ్చే చాన్సెస్ ఉంటాయి. అలాగే గ్యాస్, తిమ్మిరి, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తాయని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫోలేట్, ఆక్సిలేట్ సమ్మేళనాలు చలికాలంలో కీళ్ల నొప్పిని పెంచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో తక్కువగా తినడం లేదా అసలు తినకపోవడం బెటర్.
* పాలకూర : ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయినా సరే.. చలికాలంలో ఎక్కువగా తినకూడదంటున్నారు నిపుణులు. అలాగే కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా తినకూడదట. ఎందుకంటే ఇందులో కూడా ఫోలేట్, ఫైబర్, ఆక్సిలేట్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వింటర్‌లో జీర్ణ సమస్యలను, అధిక రక్తపోటును మరింత పెంచే చాన్స్ ఉంటుంది. అందుకే ఏవైనా అలెర్జీలు, హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు వింటర్‌లో తినకూడదు. తప్పక తినాలనుకుంటే మాత్రం ఏయే ఆహారాలు తినాలో, ఏవి తినకూడదో వైద్య నిపుణులను లేదా పోషకాహార నిపుణులను సంప్రదించి నిర్ణయించుకోవడం ఉత్తమం.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. ఆహారాలు, ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.