మూత్ర విసర్జన చేసేటప్పుడు ఒళ్లు ఎందుకు జలదరిస్తది...?

by S Gopi |   ( Updated:2022-10-25 10:51:43.0  )
మూత్ర విసర్జన చేసేటప్పుడు ఒళ్లు ఎందుకు జలదరిస్తది...?
X

దిశ, వెబ్ డెస్క్: చాలామందికి ఈ విషయంలో డౌట్ ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది. ఇలా అయితే, భవిష్యత్తులో ఏమన్న అయితదా అనే డౌట్ కూడా వెంటాడుతూ ఉంటుంది. ఇందుకు సంబంధించి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే... అయితే, మూత్ర విసర్జన చేసేటప్పుడు ఒళ్లు జలదరించడం అసంకల్పిత చర్యే అయినప్పటికీ, ప్రతీసారీ అలా జరగదు. ఏదో కారణాల వల్ల చాలా సేపటి వరకు కుదరక, ఆ తర్వాత మూత్ర విసర్జన చేసేటప్పుడు అలాంటి అనుభవం ఏర్పడుతుంది. ముఖ్యమైన శారీరక ధర్మాల్లో ఒకటైన మూత్రవిసర్జన ద్వారా శరీరంలో పేరుకున్న మలినాలు బయటకు పోతాయి. ఇలా ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకున్నప్పుడు అంతవరకు బిగుసుకుని ఉన్న కండరాలు సడలింపు అవుతాయి. అంతవరకు నొక్కిపెట్టిన స్ప్రింగ్ ను ఒక్కసారిగా వదిలినప్పుడు జరిగే చర్యలాగా శరీరానికి తక్షణ ఉపశమనం ఏర్పడినప్పుడు కండరాల కదలికలు శరీరానికి కూడా అంది ఒళ్లు జలదరిస్తది. ఇలా ఒళ్లు జలదరించడం వల్ల శరీరానికి లాభమే కానీ, నష్టమేమీ లేదంటా.



Advertisement

Next Story