పీసీఓఎస్ వల్ల కలిగే సమస్యలేంటో తెలుసా.. నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి..

by Sumithra |   ( Updated:2024-09-20 03:28:04.0  )
పీసీఓఎస్ వల్ల కలిగే సమస్యలేంటో తెలుసా.. నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : నేటి కాలంలోని జీవనశైలి కారణంగా మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా పీరియడ్స్‌, గర్భాశయానికి సంబంధించిన అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. దీంతో బిడ్డను కనడం కూడా కష్టంగా మారుతుంది. మహిళల్లో వచ్చే అనేక సమస్యల్లో పీసీఒఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య ఎక్కువగా కనబడుతుంది. ఈ సమస్య చాలా చిన్న వయస్సు మహిళలను కూడా వేధిస్తోంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, బరువు పెరగడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి మాత్రకే కాకుండా అనే లక్షణాలు, అనేక సమస్యలు కూడా కనపడతాయంటున్నారు నిపుణులు మరి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PCOS లక్షణాలు..

PCOS లక్షణాలలో ఒకటి ఏంటంటే అది నిద్ర పై ప్రభావం చూపిస్తుంది. అయితే దాని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి PCOS ద్వారా మహిళలకు నిద్రలేమి సమస్య ఉంటుందంటున్నారు నిపుణులు. నిద్ర వచ్చినప్పటికీ కళ్ళు మళ్లీ మళ్లీ తెరుచుకుంటాయి. అంతే కాదు దీని కారణంగా మహిళలు స్లీప్ అప్నియాను కూడా ఎదుర్కోవలసి వస్తుందంటున్నారు. దీని కారణంగా వారు నిద్రలో బిగ్గరగా గురక పెడుతుంటారు. ఎందుకంటే వారి శ్వాసకు ఆటంకం ఏర్పడుతుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఇదంతా జరుగుతుందని చెబుతన్నారు నిపుణులు. దీని వల్ల బరువు కూడా బాగా పెరుగుతుందంటున్నారు నిపుణులు.

అలాగే స్త్రీ స్వరంలో మార్పు, రొమ్ము పరిమాణం తగ్గడం, కండరాలు పెరగడం, ఛాతీ, ముఖం పై వెంట్రుకలు పెరగడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయంటున్నారు నిపుణులు. అంతేకాకుండా మూడ్‌లో మార్పు కూడా PCOS ప్రధాన లక్షణం. ఈ పీసీఓఎస్ మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా స్త్రీ చిరాకు, మానసిక కల్లోలం, నిరాశ మొదలైన వాటిని అనుభవించాల్సి వస్తుందంటున్నారు. PCOS కారణంగా అలసట కూడా కలుగుతుందని చాలా కొద్ది మంది మహిళలకు తెలుసు. పీసీఒఎస్‌తో బాధపడుతున్న మహిళలు నిద్రలేమి కారణంగా తరచుగా అలసిపోతారు.

PCOSతో జుట్టు పల్చబడటం..

జుట్టు సన్నబడటం, జుట్టు రాలడం కూడా PCOS కారణంగా కనిపించే ఒక లక్షణమంటున్నారు నిపుణులు. అయితే కొంతమంది మహిళలు PCOS కారణంగా తమ జుట్టు బలహీనంగా, పలుచగా, రాలిపోతుందని గుర్తించరు. పీసీఒఎస్‌లో మహిళల్లో మగ హార్మోన్ ఆండ్రోజెన్ స్థాయి పెరుగుతుంది. దీంతో హెయిర్ ఫోలికల్స్ తగ్గిపోతుంది. అందుకే మహిళల్లో జుట్టు రాలడానికి కారణమవుతుంది. అలాగే పీసీఒఎస్‌తో బాధపడుతున్న మహిళలకు వారి చర్మం పై నల్ల మచ్చలు కూడా ఉండవచ్చు. ఇవి సాధారణంగా మెడ, అండర్ ఆర్మ్స్ లేదా తొడల చుట్టూ ఉండవచ్చు. ఇలాంటి సమస్యలు తరచూ కనిపిస్తే తప్పకుండా వైద్యనిపుణులను సంప్రదించాలని చెబుతున్నారు.

గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed