- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పల్లీలు తినడం వల్ల భారీ ఆరోగ్య ప్రయోజనాలు
దిశ, ఫీచర్స్: ఖాళీగా ఉన్న సమయంలో టైం పాస్ కోసం వేరుశనగ గింజలను తినడానికి ఇష్టపడతుంటారు. ఈ అలవాటు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని అంటున్నారు నిపుణులు. పల్లీల్లో సహజ సిద్ధంగా అనేక పోషకాలు లభిస్తాయి. ఇందులో ఉండే ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, విటమిన్ B, విటమిన్ E వంటివి హెల్తీగా ఉంచుతాయంటున్న ఎక్స్‌పర్ట్స్.. ఇంతకీ వీటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో వివరిస్తున్నారు.
1. గుండె ఆరోగ్యం
వేరుశనగలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెగ్నీషియం, కాపర్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ఈ విషయం చాలా అధ్యయనాల్లో రుజువైంది కూడా. ఇక వేరుశనగలో మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నందునా.. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ధమనుల లోపలి పొరలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గితే.. గుండెకు మంచిది.
2. యాంటీఆక్సిడెంట్ బూస్ట్
ఇటీవలి కాలంలో మానసిక సమస్యలకు గురవుతున్న వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్నవారు వేరుశనగ తినడం వల్ల ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది డిప్రెషన్‌ను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది.
3. బ్లడ్ షుగర్ కంట్రోల్
డయాబెటిస్‌తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలున్నాయి.. వంశపారంపర్యంగా ఒత్తిడి, మానసిక ఇబ్బందులు, టెన్షన్‌కు గురికావడం తదితర సమస్యల వల్ల ఈ మధుమేహం బారిన పడుతుంటారు. కాగా ఈ వ్యాధి అదుపులో ఉండేందుకు వేరుశనగ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ , ప్రోటీన్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.
4. బరువు తగ్గడం
బరువు తగ్గడం అనేది చాలా మందికి పెద్ద టాస్క్. జిమ్, డైట్ వంటి అనేక రకాల మార్గాలను అనుసరించి వెయిట్ లాస్ కావడానికి ప్రయత్నిస్తారు. అయితే వేరుశనగలు మనకు ఉత్తమమైన రుచిని, శరీరానికి అవసరమైన అదనపు పోషకాలను అందించడమే కాదు ఇందులోని పీచు, ప్రొటీన్లు బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
5. మెదడు పనితీరు
అధ్యయనాల ప్రకారం ప్రతిరోజూ కొన్ని వేరుశనగలను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. కనుక మీ రోజువారీ ఆహారంలో పల్లీలను భాగం చేసుకోండి. మెదడు ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది.
6. కండరాల బలోపేతం
ఎముకలను బలోపేతం చేయాలనుకుంటే.. వేరుశనగలను ఎంచుకోండి. వీటిలో సమృద్ధిగా ఉండే మాంగనీస్, ఫాస్పరస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అధిక ప్రోటీన్ కంటెంట్ కండరాల మరమ్మత్తు, పెరుగుదలలో సహాయపడుతుంది. చురుకుగా ఉంచుతుంది.
7. జీర్ణ వ్యవస్థ
వేరుశనగలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని మూలానా ప్రేగు, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మల మూత్ర సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇందులోని ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల.. కొన్ని గింజలు తినగానే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. అందుకే జంక్ ఫుడ్ కంటే వేరుశనగ వంటి గింజల్ని మీ ఆహారంలో చేర్చుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
8. పోషక పవర్ హౌస్
వేరుశనగ విటమిన్లు, ఖనిజాలు, ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలను అందిస్తుంది.