New style : అందాల ప్రపంచం.. అట్రాక్టివ్ ఫ్యాషన్ ట్రెండ్స్..

by Javid Pasha |
New style : అందాల ప్రపంచం.. అట్రాక్టివ్ ఫ్యాషన్ ట్రెండ్స్..
X

దిశ, ఫీచర్స్: ఫ్యాషన్.. ఈ వర్డ్ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. దాని స్వభావం అలాంటి. అందులో మీరు కూడా ఉండాలంటే మోడ్రన్ ఫ్యాషన్ పోకడలను అనుసరించాల్సిందే అంటున్నారు నిపుణులు. అంతేకాదు రాబోయే ట్రెండ్స్‌ను ముందుగానే ఊహించి అడుగు ముందుకు వేయగలగాలి. ఫ్యాషన్ వరల్డ్ గురించిన విషయాలు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. సౌంకర్యవంతమైన ఆవిష్కరణలు మొదలు కళలను మిళితం చేసే ట్రెండ్స్ టేప్‌స్ట్రీస్ వరకు అదే క్యూరియాసిటీ కనిపిస్తుంది. హై ఫ్యాషనబుల్ అథ్లెటిక్ ఇన్‌ఫ్లుయెన్స్ నుంచి స్పోర్ట్స్‌వేర్ సౌందర్యం వరకు ఫ్యాషన్ ప్రపంచం విస్తరిస్తోంది. దీనిపై ప్రజల్లో ముఖ్యంగా యంగ్ జనరేషన్‌లో ఆసక్తి పెరుగుతోంది. అటువంటి కొన్ని నయా ట్రెంట్స్ గురించి తెలుసుకుందాం.

స్పోర్ట్స్ ఇన్‌స్పైర్డ్

కొత్త సంవత్సరంలో అథ్లెటిక్ అండ్ స్పోర్ట్-ఇన్‌స్పైర్డ్ ఫ్యాషన్‌లో గణనీయమైన పెరుగుదల కనిపిపిస్తోంది. ఇది ఫ్యాషన్ ఔత్సాహికులలో క్రీడలపట్ల పెరుగుతున్న ఆసక్తికి, పాపులారిటీకి నిదర్శనంగా పేర్కొనవచ్చు. అయితే ఈ ట్రెండ్ కేవలం అథ్లెటిక్ దుస్తులకే పరిమితం కాలేదు. స్పోర్టీ ఎలిమెంట్స్‌ను రోజువారీ ఫ్యాషన్‌లో చేర్చడం వరకు విస్తరించింది. స్టైల్‌ అండ్ కంఫర్ట్‌లోనూ దూసుకుపోతోంది.

మోడెస్ట్ అండ్ అప్రోచబుల్

షీర్ ఫ్యాషన్ అనేది వాస్తవానికి రీ క్యూరింగ్ ట్రెండ్. కానీ 2024లో ఇది మరింత ఆదరణ పొందుతుందని నిపుణులు చెప్తున్నారు. నిరాడంబరమైన ధరించగలిగిన రూపంలో ఇది డెవలప్ అవుతోంది. డిజైనర్లు షీర్ పెన్సిల్ స్కర్ట్స్‌ను క్రూ-నెక్ నిట్స్‌తో అటాచ్ చేయడం వంటి మరింత సూక్ష్మమైన మార్గాలలో పారదర్శక పదార్థాలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మార్పు శరీరానికి మోడ్రన్ ట్రెండ్‌కి మధ్య సమతుల్యతను క్రియేట్ చేస్తుంది. డైలీవేర్ కోసం మరింత సౌకర్యవంతమైన రీతిలో అందుబాటులో ఉండే మల్టిపుల్ ఫ్యాషన్ ఫ్యాషన్ ఎంపికలను అందిస్తుంది.

కాంట్రాస్ట్ పెయిరింగ్స్

ఫ్యాషన్ కాంట్రాస్ట్స్ బ్యూటీ ట్రెండ్ అనేది ఊహించని కొత్త కలయిలతో మిళతం అయి ఉంటుంది. ప్రాడా అండ్ ఫెర్రాగామో వంటి పెద్ద, ప్రతిష్టాత్మకమైన బ్రాండ్స్ కూడా డిఫరెంట్ మిక్సింగ్‌తో ఆకర్షించేలా రూపొందించడంలో నైపుణ్యం సాధించాయి. ఈ ట్రెండ్ ట్రెడీషనల్ ఫ్యాషన్ నిబంధనలను సవాలు చేస్తుంది. అలాగే యునిక్ కాంబినేషన్ ద్వారా ఇండివిడ్యుల్ ఎక్స్‌ప్రెషన్‌ను ప్రోత్సహిస్తుంది. అట్రాక్టివ్ కోట్‌తో సున్నితమైన దుస్తులను జత చేయడం లేదా హార్డ్ లెదర్‌తో సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ మిళతం చేయడంవల్ల కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేయడం ఇందులో భాగంగా ఉంది.

టైడ్ - అప్ స్టైల్స్

మరొక ముఖ్యమైన ట్రెండ్ నాట్స్ అండ్ టైడ్-అప్ స్టైల్స్‌ను గార్మెంట్స్‌లో క్రియేటివ్‌గా యూజ్ చేయడం. ఈ ట్రెండ్ నడుము చుట్టూ స్వెటర్స్ కట్టుకునే స్టైలింగ్ ట్రిక్ నుంచి పుట్టుకొచ్చింది. అలాగే నాట్స్ (knots) వస్త్రంలో అంతర్భాగంగా ఉండే డిజైన్స్‌గా పరిణామం చెందాయి. ఈ ట్రెండ్ ఫ్యాషన్‌లో ఇన్నోవేషన్‌లో డిజాయిర్‌ను(desire)తెలియ జేస్తుంది. సాంప్రదాయ దుస్తులను క్రియేటివిటీగా మళ్లీ ట్రెండింగ్‌లోకి తెచ్చింది.

లోగో మానియా రిటర్న్

క్విట్ లగ్జరీని స్వీకరించిన సంవత్సరాల తర్వాత లోగోమానియా ఫ్యాషన్ రిటర్న్ అయిందని చెప్పవచ్చు.2024లో దీనిపై ఆసక్తి పెరుగుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా స్మాలెస్ట్ లోగోస్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఫ్యాషన్ నిపుణుల ప్రకారం. ఈ సంవత్సరం లోగోమానియా 51 శాతం పెరుగుతుంది. లోగోస్ పెద్దవిగా లేదా మెరిసేవిగా ఉండకపోవచ్చు కానీ ఇండియన్ డిజైనర్ బ్రాండ్స్ ట్రెడీషనల్ లోగోస్ అండ్ సిగ్నేచర్ స్టైల్ లోగోస్ సమ్మేళనాన్ని చూస్తాయి. ప్రజెంట్ తక్కువగా ఉన్నాయి కానీ రాబోయే రోజుల్లో ఈ రకమైన ఫ్యాషన్ దుస్తులకు ఆదరణ మరింత పెరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed