Eye Care Tips : చలికాలంలో కళ్లపై పొల్యూషన్ ఎఫెక్ట్.. వెంటనే రిలీఫ్ కోసం ఏం చేయాలంటే..

by Javid Pasha |
Eye Care Tips : చలికాలంలో కళ్లపై పొల్యూషన్ ఎఫెక్ట్.. వెంటనే రిలీఫ్ కోసం ఏం చేయాలంటే..
X

దిశ, ఫీచర్స్ : మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో వాతావరణ కాలుష్యం, వాయు కాలుష్యం అధికంగా ఉంటాయి. దీంతో కళ్లు ఎర్రబడటం, పొడిబారడం, దురద, మంట, శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ల సంరక్షణ కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, యూవీ కిరణాల నుంచి రక్షణ కోసం కళ్లజోడు ఉపయోగించడం వంటివి చేయాలి. ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

* శరీరంలో ఎంతో ముఖ్యమైన కళ్లు చాలా సున్నితమైన అవయవాలు కూడా. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గాలిలోని దుమ్ము, ధూళి, పలు రకాల విష పదార్థాలు కళ్లల్లోకి చేరితే హాని కలిగిస్తాయి. ఇన్‌ఫెక్షన్లు సోకి దురద, మంట వంటివి సంభవిస్తాయి. కాబట్టి బయటి వాతావరణ పరిస్థితుల్లో కళ్ల జోడు ధరించడం బెటర్. అలాగే అలసిపోయినట్లు అనిపించినా, కళ్లు నొప్పి పుట్టినా కోల్డ్ కంప్రెస్ తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. నిద్రకు ఉపక్రమించే ముందు ధరించగలిగే కోల్డ్ కంప్రెస్ ప్యాడ్‌లు కూడా ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. అలాంటి అవకాశం లేకపోతే శుభ్రమైన కాటన్ గుడ్డను నీటిలో తడిపి కళ్లపై ఉంచడంవల్ల ఉపశమనం కలుగుతుంది.

* బయట తిరిగి వచ్చిన తర్వాత మొహం, కళ్లను నీటితో శుభ్రంగా కడుక్కోవడం, సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవడం, ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ ఎ, ప్రొటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం వంటివి చేయడంవల్ల కళ్లకు మేలు జరుగుతుంది. ఇక కాలుష్యంవల్ల గానీ, ఇంకేదైనా ప్రాబ్లం వల్లగానీ కళ్లల్లో దురద, మంట, ఎర్రబడటం వంటివి సంభవిస్తే వెంటనే కంటి వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

* గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed