- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Earthquake : పర్యావరణ విధ్వంసం.. భూ కంపాలు అందుకే వస్తున్నాయా?
దిశ, ఫీచర్స్ : సరిగ్గా న్యూ ఇయర్ రోజునే జపాన్‌లో సంభవించిన వరుస భూకంపాలు ఆ దేశ ప్రజలనే కాదు, ప్రపంచం మొత్తాన్ని భయభ్రాంతులకు గురిచేశాయి. ఏకంగా 155 భూకంపాలు విరుచుకుపడి ఆ దేశాన్ని అతలా కుతలం చేశాయి. వీటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇక మరో మూడు రోజుల తర్వాత 2024, జనవరి 3న ఆఫ్ఘనిస్తాన్‌లో కూడా అదే జరిగింది. అరగంట వ్యవధిలో రెండు భూ కంపాలు సంభవించాయి. చైనాలోనూ పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అయితే ఈ విపత్కర పరిస్థితులు ప్రజల్లోనే కాదు, పర్యావరణ వేత్తల్లో ఆందోళన రేకెత్తిస్తు్న్నాయి. ఎందుకంటే వరల్డ్‌వైడ్‌గా సంభవిస్తున్న వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణం అవుతాయని పేర్కొంటున్నారు. తాజా పరిణామాలను ఎనలైజ్ చేసిన యూఎస్ జియోలాజికల్ నిపుణులు భవిష్యత్తులో భూ కంపాలు, సునామీలు సముద్రాల్లో అల్ల కల్లోలిత పరిస్థితులు వంటివి మరింత ఎక్కువగా సంభవించే అవకాశం లేకపోలేదనే అంచనాకు వచ్చారు. అందుకే ప్రకృతిని నాశనం చేసే విధ్వంసకర మానవ చర్యలను ప్రపంచ దేశాలు కంట్రోల్ చేసే దిశగా ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ప్లానెట్‌పై ఎఫెక్ట్
భూకంపాలు రావడం ఈ సంవత్సరం ఏం కొత్త కాదు.. వాస్తవానికి 2004లో ప్రపంచ చరిత్రిలో గుర్తుండిపోయేలా హిందూ మహాసముద్రంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 9.1 నుంచి 9.3 మధ్య నమోదైందని నిపుణులు పేర్కొంటున్నారు. గత భూకంపాలతో పోల్చితే మూడవ అత్యంత శక్తివంతమైన భూకంపంగా దానిని పర్యావరణ వేత్తలు గుర్తించారు. ఆ తర్వాత కూడా పలుచోట్ల కొనసాగిన సునామీ వల్ల రెండున్నర లక్షలమంది ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టులు చెప్తున్నాయి. పైగా నాటి విపత్కర పరిస్థితులు సముద్ర తీర ప్రాంతంలోని భూ ఆకృతులను కూడా మార్చివేశాయి. నాసా సైంటిస్టుల ప్రకారం. ఉత్తర ధ్రువంపై చాలా ఎఫెక్ట్ పడింది. ఇక 1900 సంవత్సరంలో సంభవించిన తీవ్ర భూకంపంవల్ల ఉత్తర ధ్రువం తూర్పు దిశగా 2.5 సెం.మీ. వరకు జరిగింది.
భూ కంపాలు.. పర్యవసనాలు
భూ పరిమాణాన్నే మార్చగల సామర్థ్యంతోపాటు భూకంపం మొత్తం ప్రజలను కదిలిస్తుందని చెప్పడానికి ఇటీవల జపాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్‌లలో, అలాగే 2010 సంవత్సరంలో కూడా సంభవించిన భూకంపాలను ఉదాహరణగా చెప్పవచ్చు. అప్పట్లో చిలీలోని కాన్సెప్సియోన్ సిటీలో రిక్టర్ స్కేలుపై 8.8 తీవ్రతతో సంభవించి ఎర్త్‌క్వేక్ ఆ సిటీని దాని అసలు స్థానం నుంచి పశ్చిమానికి 3 మీటర్ల (10 అడుగులు) వరకు తరలించింది. ఇక 1960లో రిక్టర్ స్కేల్‌పై 9.5 తీవ్రతతో సంభవించిన వాల్డివియా భూ కంపం వల్ల కూడా చిలీ అధ్వాన్నంగా మారింది. 1556లో చైనాలోగల షాంగ్సీ ప్రావిన్స్‌లోని హుయాక్సియన్‌లో సంభవించిన భూకంపం చరిత్రలోనే అత్యంత ఘోరమైంది. ఆ తర్వాత 1811 నుంచి 1812 వరకు సెంట్రల్ యూఎస్ మిడ్ వెస్ట్‌లో రెండువేలకుపైగా భూ కంపాలు సంభవించాయి. న్యూ మాడ్రిన్ అని పిలువబడే ఈ భూ కంపాలు అనేక పట్టణాలను నాశనం చేశాయి. రిక్టర్ స్కేల్‌పై 9.0 - 9.1 తీవ్రతతో సంభవించిన 2011 నాటి టోహోకు భూ కంపం, సునామీ ఈ రెండు జపాన్ చరిత్రలోనే నమోదైన అతిపెద్ద భూకంపాలు కాగా, తాజాగా 2024లో ఆ దేశంలో 150 చోట్ల భూకంపాలు విరుచుకుపడి రిక్టర్ స్కేల్‌పై 7.5 గా నమోదయ్యాయి.
ప్రకృతి వైపరీత్యమా.. మానవ తప్పిదమా?
జియోలాజికల్ నిపుణుల ప్రకారం అయితే.. భూకంపాలు అరుదుగా కొన్ని లిమిటెడ్ ఏరియాస్‌లో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆధునిక మానవుడు నేచర్‌పకై పట్టు సాధించే చర్యల్లో భాగంగా క్రియేట్ అవుతున్న పర్యావరణ మార్పులు, కాలుష్యం, సహజ వనరుల విధ్వంసం, హానికరమైన కర్బన ఉద్గారాల విడుదల, చమురును ఇష్టానుసారంగా మండించడం, అడవులు, కొండలు, పచ్చని చెట్లను నాశనం చేయడం వంటి చర్యలతో పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. దీంతోపాటు మూడు దశాద్దాలుగా ప్రపంచాన్ని గ్లోబల్ వార్మింగ్ కూడా పీడిస్తోంది. రుతువులు గతులు తప్పుతున్నాయి. ఉష్ణోగ్రతల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. వైపరీత్యాలు తేమ, వాతావరణ పీడనాలపై ఇంపాక్ట్ చూపుతున్నాయి. ఫలితంగా సముద్రాల్లోనూ అల్లకల్లోలాలు, పలుచోట్ల అగ్ని పర్వత విస్ఫోటనాలు, భూ కంపాలు సంభవించడం జరుగుతున్నాయని యూఎస్ జియోలాజికల్ నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. అలాగే చమురు, గ్యాస్ వంటి వనరులకోసం డ్రిల్లింగ్ చేయడంవంటి మానవ చర్యలు భవిష్యత్తులో మరిన్ని భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశాన్ని ప్రేరేపిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. పర్యావరణ విధ్వంసం కేవలం భూమిపై మాత్రమే కాకుండా సూర్యుడు, చంద్రుడు వంటి ఇతర గ్రహాలపై ఎఫెక్ట్ చూపుతుంది. ఫలితంగా భూ కంపాలు, సౌర తుఫానులు, ప్రకంపనలు, భూ పరిణామంలో మార్పులతో పాటు విధ్వంసాలు సంభవించవచ్చు.