Life Journey : అట్రాక్షన్ to రియలైజేషన్

by Javid Pasha |
Life Journey : అట్రాక్షన్ to రియలైజేషన్
X

దిశ, ఫీచర్స్ : అట్రాక్షన్ మొదలు అర్థం చేసుకునేదాకా రిలేషన్ షిప్స్‌లో పలు దశలు ఉంటాయని ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక స్త్రీ, పురుషుల మధ్య కొనసాగే పర్సనల్ విషయాలు, బౌండరీస్ విషయానికి వస్తే ఒకరినొకరు అర్థం చేసుకోవడం మొదలుకొని ఒక్కటై స్థిరపడేవరకు అనేక ఆలోచనలు, ఆనందాలు, భావోద్వేగాలు సంఘర్షించుకుంటాయి. ఇద్దరు వ్యక్తులు జీవితంలో చక్కటి అనుబంధాన్ని ఏర్పర్చుకుని హ్యాపీగా జీవించాలంటే వ్యామోహం నుంచి అంగీకారం వరకు నాలుగు ముఖ్యమైన దశలను అధిగమించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.

వ్యామోహం

ఇది ప్రారంభ దశ.. తరచూ మెదడు డోపమైన్, ఆక్సిటోసిన్ వంటి లవ్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. దీనివల్ల మనలో హాప్పీనెస్, సేఫ్టీ, ఎమోషనల్‌టచ్ వంటి ఫీలింగ్స్ కలుగుతాయి. మెదడు హేతుబద్ధమైన ఆలోచనలకంటే ఆవేశం, భావోద్వేగాలవైపే మొగ్గుతుంది. ఒక పట్టాన ఎవరూ చెప్పింది పట్టించుకోకుండా మనకు నచ్చిందే చేస్తుంటాం.

రియలైజేషన్

ఈ దశలో లవ్ హార్మోన్లు క్షీణించడం ప్రారంభిస్తాయి. వ్యక్తిలో వాస్తవాలు తెలుసుకునే ఆలోచన పెరుగుతుంది. గత ఆలోచనలు కొన్ని ఈ దశలో ఉన్నప్పుడు కరెక్ట్ కావు అని కూడా అనిపంచవచ్చు. లేదా వింతగా మనం అలా ప్రవర్తించామా? అనే సందేహం, ఆశ్చర్యం కూడా కలుగువచ్చు. రిలేషన్ షిప్‌లో భ్రమలకు స్వస్తి పలికి వాస్తవాలను గ్రహించడం ప్రారంభిస్తారు.

టెన్షన్

రిలేషన్ షిప్ నాలుగు దశలలో ఇది ఉద్రిక్తతతో కూడి ఉంటుంది. ఇద్దరి మధ్య విభేదాలు రావడం, పరిష్కరించబడటం జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో కపుల్స్ చాలా కాలం పాటు టెన్షన్ అనుభవించే దశలో ఉంటారు. రిలేషన్ షిప్‌ను కొనసాగించడం, లేదా విడిపోవడం అనే నిర్ణయాలు ఇక్కడే స్టార్ట్ అవుతాయి.

యాక్సెప్టేషన్

యాక్సెప్టేషన్ లేదా అంగీకారం.. ఈ దశలో వ్యక్తులు రిలేషన్‌షిప్ ఫాంటసీ థాట్స్ నుంచి బయటపడతారు. విభేదాలను పరిష్కరించుకోవడం, అర్థం చేసుకోవడం,అడ్జస్ట్ అవ్వడం ప్రారంభిస్తారు. కలిసి జీవించేందుకు ఇరువైపులా ప్రయత్నాలు కొనసాగిస్తారు.

Advertisement

Next Story

Most Viewed