Sleeping postures : సమస్యను బట్టి పడుకునే పొజిషన్ మార్చడంతో హెల్త్ బెనిఫిట్స్ ఇవే..

by Javid Pasha |
Sleeping postures : సమస్యను బట్టి పడుకునే పొజిషన్ మార్చడంతో హెల్త్ బెనిఫిట్స్ ఇవే..
X

దిశ, ఫీచర్స్ : మీరు హ్యాపీగా, ప్రొడక్టివ్‌గా, యాక్టివ్‌గా ఉండాలంటే తగినంత నిద్ర అవసరమనే విషయం తెలిసిందే. కానీ నిద్రపోయే పొజిషన్ లేదా స్లీపింగ్ మోడ్ సక్రమంగా లేకపోతే కూడా హెల్త్ ఇష్యూస్ మరింత పెరుగుతాయి. కొన్నిసందర్భాల్లో మీరు పడుకునే పొజిషన్ కూడా వివిధ రోగాలను, నొప్పులను దూరం చేస్తుందని నిపుణులు అంటున్నారు. సమస్యను బట్టి ఏ విధమైన భంగిమలో పడుకుంటే మేలు జరుగుతుందో వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా గురక, నెక్ పెయిన్, ఎసిడిటి, వెన్నునొప్పి, కండరాల నొప్పి వంటివి వేధిస్తుంటే డిఫరెంట్ స్లీపింగ్ మోడ్ టెక్నిక్స్‌ రిలాక్సేషన్ కలిగిస్తాయని చెప్తున్నారు.

గురక, నెక్ పెయిన్‌ ఉంటే ఇలా చేయండి

మీకు నిద్రలో గురకపెట్టే అలవాటు ఉంటే గనుక రొటీన్ స్లీపింగ్ మోడ్‌ను మార్చాలి. ఆ టైంలో మీ తలను సాధారణంకంటే కాస్త ఎత్తైన దిండుమీద ఆనించి నిద్రపోవడంవల్ల రిలాక్స్ అవుతుంది. దీనివల్ల గురక పెట్టేవారికి శ్వాసపరమైన ఇబ్బందులు తలెత్తకపోవడంతోపాటు శబ్దం రాకుండా ఉంటుంది. ప్రస్తుతం చాలామంది వేధిస్తున్న సమస్యల్లో మెడనొప్పి ఒకటి. ఇది నిద్రలేమికి కారణం అవుతుంది. ట్రీట్మెంట్‌తో పాటు మీరు పడుకునే భంగిమను మార్చడం ద్వారా రిలాక్స్ అయ్యే అవకాశం ఎక్కువ. డైలీ పడుకునే ముందు మెడకింద ఎత్తైన దిండు వేసుకోవద్దు. మీరు వేసుకునే పొజిషన్‌ను బట్టి దిండు మీ భుజానికి సమానమైన ఎత్తులో మాత్రమే ఉండేలా చూసుకోవాలి. ఇక ఈ సందర్భంలో నిటారుగా పడుకోవడం కొంతకాలం కొనసాగిస్తే మెడనొప్పి తగ్గుతుంది.

వీపును నేలపై వాల్చి పడుకోండి..

బ్యాక్ పెయిన్ కూడా చాలా ఇబ్బందికరమైన సమస్య. దీనివల్ల ఏ పనీ చేసుకోలేకపోతారు. కాబట్టి తగిన స్లీపింగ్ మోడ్‌తో దీనికి చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఏంటంటే.. వెన్ను నొప్పితో బాధపడేవారు నిద్రలో ఇబ్బందికి గురికాకుండా ఉండాలంటే వెనుక వెనుకభాగం నేలపై ఉండేలా పొజిషన్‌లోనే పడుకోవాలి. ఈ సందర్భంలో మోకాళ్ల కింది భాగంలో దిండును ఉంచుకోవాలి. ఇది వెన్నెముక సరైన పొజిషన్‌లో ఉండేందుకు దోహదం చేస్తుంది. ఒక వేళ మీరు స్లిమ్‌గా ఉండి మీ నడుము నేలకు ఆనలేకుండా ఉంటే నడుము కింద కూడా చిన్నపాటి దిండు కానీ, మెత్తటి బెడ్‌షిట్ కానీ పెట్టుకోవాలి. వన్‌వీక్ ఈ స్లీపింగ్ మోడ్ పాటిస్తే బ్యాక్ పెయిన్ తగ్గే అవకాశం ఉంది.

ఎసిడిటి, పీరియడ్ సమయంలో..

కడుపులో ఉబ్బరంగా అనిపించే ఎసిడిటివల్ల, అలాగే తరచూ కాళ్లు తిమ్మిర్లు పట్టే ఇబ్బంది ఉన్నవాళ్లు నిద్రరాక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటివారు తల కింద ఒక ఎత్తైన దిండును ఉంచుకొని పడుకోవాలి. ఎసిడిటివల్ల హార్ట్ బర్న్ అనిపించినప్పుడు ఎడమ వైపు తిరిగి పడుకుంటే రిలాక్స్ అవుతుంది. ఇక కాళ్లు తిమ్మిర్లు పట్టే సమస్యతో బాధపడేవారు రాత్రిపూట పడుకునే ముందు పాదాలకు మసాజ్ చేసుకోవాలి. నొప్పి నుంచి ఉశమనానికి హాట్ ప్యాడ్ కూడా యూజ్ చేయవచ్చు. ఇక మహిళలు పీరియడ్ టైంలో కడుపువల్ల రాత్రిపూట నిద్రపట్టదు. ఆ సమయంలో స్లీపింగ్ పొజిషన్ మారిస్తే ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా పక్కకు తిరిగి పడుకుని, మోకాళ్లను ఛాతివైపునకు ముడుచుకొని పడుకుంటే కండరాలపై ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు.

Advertisement

Next Story

Most Viewed