Will Power .. మానసిక కల్లోలాన్ని ఎదుర్కొనే యూజ్‌‌ఫు‌ల్ ట్రిక్స్ !

by Javid Pasha |   ( Updated:2024-01-08 15:12:07.0  )
Will Power .. మానసిక కల్లోలాన్ని ఎదుర్కొనే యూజ్‌‌ఫు‌ల్ ట్రిక్స్ !
X

దిశ, ఫీచర్స్ : నిద్రలేని రాత్రులు, తీవ్రమైన అలసట, వివిధ మానసిక కల్లోలాలు మీలో ఉల్లాసం, ఉత్సాహం, క్రియేటివిటీని తగ్గిస్తాయి. వర్క్ కల్చర్‌పై, క్వాలిటీపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతాయి. ఇటీవల వరల్డ్ వైడ్‌గా ఈ సమస్య పెరుగుతోంది. ‘రీసెర్చ్ ఇన్ ఆర్గనైజేషనల్ బిహేవియర్’ స్టడీ ప్రకారం.. ప్రవర్తనలో, పనిలో యాక్టివ్‌నెస్ ఉండాలంటే.. ముందు మీ మూడ్ బాగుండాలి. దీంతోపాటు క్వాలిటీ స్లీప్, మానసిక ప్రశాంతత అవసరం. ఉదాహరణకు మీరు ప్రశాంతంగా నిద్రపోయినప్పుడు మరుసటిరోజు ఎలా ఉంటారో, అదే నిద్రపోకుండా ఉంటే మీ మూడ్ ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుంటే, దాని ప్రయారిటీ ఏంటో మీకే తెలుస్తుంది అంటున్నారు నిపుణులు. అయితే ఇటువంటి అవకాశంలేక కొన్నిసార్లు మానసిక కల్లోలాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతూ ఉంటుది. ఇలాంటప్పుడు టెంపరరీగా తమలోని బలహీనతను ఎదుర్కోవడంలో, ప్రొడక్టివిటీగా ఉండటంలో విల్ పవర్ యూజ్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రొడక్టివ్‌గా ఉంటారు

రాత్రిపూట, అలాగే నైట్ షిఫ్టులు చేసేవారు పగటిపూట ప్రశాంతంగా నిద్రపోయినప్పుడే మరుసటి రోజు యాక్టివ్‌గా, ప్రొడక్టివ్‌గా ఉంటారు. లేకపోతే ఉత్సాహం కోల్పోతారు. ఫలితంగా ఆరోజు చేయాల్సిన పనిని మరుసటి రోజుకు వాయిదా వేస్తుంటారు. ఒకవేళ బలవంతంగా మీరు వర్క్ పూర్తి చేసినా క్వాలిటీ, ప్రొడక్టివిటీ సక్రమంగా ఉండదు. అయితే ప్రతికూల ప్రభావం పడకుండా గట్టెక్క గలిగే తాత్కాలిక శక్తి ఒకటి ఉంది. అదే మీలోని సంకల్పబలం లేదా విల్ పవర్. అలాంటి వాటిలో రీ థింకింగ్ మెథడ్ ఒకటి. మీ ఆలోచనలు, ప్రవర్తనలను కంట్రోల్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ ఆలోచనలను నెగెటివ్ పొజిషన్ నుంచి పాజిటివ్ పొజిషన్ వైపు మార్చడమే సంకల్ప శక్తిని ప్రేరేపిస్తాయి. దీనివల్ల ప్రొడక్టివ్‌గా ఉంటారు. తాత్కాలిక మానసిక కల్లోలాల నుంచి బయటపడతారు.

పరిస్థితులను మార్చండి

మీరు డైటింగ్ చేయాలనుకుంటారు. కానీ కిచెన్‌లోకి వెళ్లిన ప్రతిసారి ఫ్రిజ్‌లో రకరకాల పదార్థాలు కనిపించగానే ఏదో ఒకటి తినకుండా ఉండలేరు. ఇటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా ఆ పదార్థాలు ఫ్రిజ్‌లో లేకుండా చేయడమే చక్కటి పరిష్కారం. మీరు అనుకున్నది సాధించడం కూడా సులభం. అలాగే సంకల్ప శక్తిని ప్రదర్శించడంలోనూ ఇదే అనుసరించాలి. తమకు ఇబ్బందికరమై, అలాగే అవసరం లేని పరిస్థితులను నివారించడంలో మీ ఆలోచనలను సానుకూలతవైపు మళ్లించాలి. ఒకవైపు మిమ్మల్ని నిద్రవెంటాడుతున్నా, పనిచేయడానికి ఓపికలేకున్నా అది ముఖ్యమైనది అయితే విల్ పవర్‌ను ఆశ్రయించి తాత్కాలికంగా బయటపడవచ్చు.

ఇంట్రెస్టింగ్ అంశాలపై ఫోకస్

నెగెటివ్ థాట్స్‌ను, ఎమోషన్స్‌ను, హానికరమైన ప్రభావాలను ఎదుర్కొనేందుకు కాస్త ఇబ్బంది అనిపించినా అప్పుడున్న పరిస్థితుల్లో సానుకూలంగా ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ మానసిక శక్తిని పునరుద్ధరించడంలో ఇవి సహాయపడతాయి. దీనినే సంకల్ప శక్తి లేదా విల్ పవర్ అంటున్నారు నిపుణులు. అలాగే స్లీప్‌లెస్ నైట్స్ ఎదుర్కొన్నప్పుడు, మీరు డల్‌గా ఉన్నప్పుడు, మూడ్ బాగా లేనప్పుడు ఆ పరిస్థితి నుంచి బయట పడటానికి ఇంట్రెస్టింగ్ విషయాలపై ఫోకస్ చేయండి. ఒక ఫన్నీ వీడియో చూడండి. దీనివల్ల మీలో నెగెటివిటీ పోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా అప్పటికప్పుడు చేయాల్సిన వర్కులో నాణ్యత పెరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed