- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్డును ఈ సమయంలోనే తీసుకోవాలని చెబుతున్న నిపుణులు.. ఎందుకంటే?
దిశ, ఫీచర్స్: గుడ్లు పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా తినే ఆహారం. గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. గుడ్లలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ, వాటిలో ఉండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మీ మెదడుకు అనేక విధాలుగా మేలు చేస్తాయి. సరైన సమయంలోనే గుడ్లను తీసుకోవాలని, సమయం దాటినా తర్వాత తీసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం కంటే సాయంత్రం పూట తింటేనే ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. దీని వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
ఒత్తిడి తగ్గుతుంది
సాయంత్రం పూట గుడ్లు తినడం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే వాటిలో ట్రిప్టోఫాన్ పుష్కలంగా ఉంటుంది, ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది.ఇది శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతను తగ్గిస్తుంది. కాబట్టి సాయంత్రం గుడ్లు తినాలి.
నిద్రను మెరుగుపరచుకోండి
మెలటోనిన్ నిద్రను మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది నాడీ కణాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నిద్రలేమితో బాధపడేవారికి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది
సాయంత్రం గుడ్లు తీసుకోవడం వల్ల బరువు తగ్గవచ్చు. ఇది మీ ప్రేగు కదలికలను వేగవంతం చేస్తుంది. ఎగ్స్ లో ఉండే ప్రోటీన్ మీ కడుపు నిండిన అనుభూతినిస్తుంది. రాత్రిపూట ఆకలిని తగ్గిస్తుంది. అంతే కాకుండా, ఇది కండరాలను బలపరుస్తుంది ఆలాగే హార్మోన్ల పనితీరును సమతుల్యం చేస్తుంది.