ఆ బార్బీ బొమ్మ‌ను చూసి ఏడ్చేసింది.. కార‌ణం తెలిస్తే మీరు కూడా..! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-08-18 15:55:04.0  )
ఆ బార్బీ బొమ్మ‌ను చూసి ఏడ్చేసింది.. కార‌ణం తెలిస్తే మీరు కూడా..! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః త‌మ మ‌నుమ‌లు, మ‌న‌వ‌రాళ్లు ఏదైనా ఉన్న‌తంగా సాధించిన‌ప్పుడు తాత, బామ్మ‌లు తెగ సంబ‌ర‌ప‌డ‌తారు. ఎంతో గ‌ర్వంగా ఫీల‌వుతారు. సోష‌ల్ మీడియాలోనూ గ్రాండ్ పేరెంట్స్‌తో గ్రాండ్ చిల్డ్ర‌న్స్ అనుబంధాన్ని చూపించే వీడియోలో మ‌న‌సుకు హాయినిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో కూడా ఇలాగే హృద్యంగా ఉంటుంది. త‌న మ‌న‌మ‌రాలి రూపంలో ఉన్న బార్బీ బొమ్మ‌ను ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లో చూసిన వృద్ధ మ‌హిళ ఆనంద బాష్పాల‌తో సంతోషాన్ని తెలియ‌జేస్తుంది. dr.audreyxsue ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంట‌ర్నెట్‌లో అంద‌రి హృద‌యాల‌ను క‌దిలిస్తోంది.

క‌రోనా మహమ్మారి ప్ర‌పంచాన్ని కుదిపేస్తుంటే, నాగ‌రిక జీవితాన్ని గ‌డిపే ప్ర‌తి మ‌నిషిని భ‌యాందోళ‌ల‌లో ముంచిన‌ప్పుడు హీరోలుగా ప్రాణాల‌కు తెగించి వైద్య సేవ‌లందించిన క‌రోనా వారియ‌ర్లు ఎంతో మంది. వారిలో ఉత్త‌మ సేవ‌లందించిన‌ ఆరుగురు మహిళ‌ల్లో డాక్టర్ ఆడ్రీ స్యూ క్రజ్ అనే వైద్యురాల్ని కూడా ప్ర‌ఖ్యాత బార్బీ బ్రాండ్ ఎంపిక చేసుకుంది. స‌రిగ్గా ఆమె పోలికతో బార్బీ బొమ్మను త‌యారు చేసి, ఆమెను సత్కరించారు. ఈ విష‌యం తెలుసుకొని, "మా బామ్మ ఆసుపత్రి నుండి బయటకు వచ్చింది. నా బార్బీ బొమ్మను మొదటిసారి ప్రదర్శనలో చూసింది" అని వీడియో చెబుతుండ‌గా, తన మనవరాలి బార్బీ బొమ్మను చూసి ఆ వృద్ధురాలు కన్నీళ్లు పెట్టుకుంది. ఈ సంద‌ర్భంగా త‌న బామ్మ ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని ఇంటిల్ల‌పాదిని ఎలా సాకిందో వైద్యురాలు ఈ పోస్ట్‌లో వెల్ల‌డించారు.

"మా అమ్మమ్మ (అమ్మ) ఫిలిప్పీన్స్‌లోని వరి పొలంలో పెరిగారు. పేదరికంలో పెరిగిన ఆమెకు ఉన్నత చదువులు చదివే అవకాశం లేకపోయింది. మా అమ్మ‌, తన కుమార్తె, మనవళ్లకు ఆమె కంటే మెరుగైన జీవితాన్ని అందించడానికి ఒక చిన్న వ్యాపారిగా మారి చాలా కష్టపడింది. తర్వాత USకి వెళ్లడానికి త‌న‌కున్న‌ ప్రతిదాన్ని అమ్మేసింది. అక్కడ ఆమెకు క్యాసినోలో స్లాట్ మెషీన్లను శుభ్రపరిచే ఉద్యోగం వచ్చింది. నా కలలను చేరుకోవడానికి బామ్మ‌ నన్ను ప్రేరేపించింది. నేను నా ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసాను, నా వైద్య డిగ్రీని పొందాను. వైద్యురాలిగా మహమ్మారి స‌మ‌యంలో ముందు వరుసలో పోరాడాను. అన్నీ మా అమ్మమ్మ కృషి, పోరాటాల నుండి ప్రేరణ పొందిన‌వే. నాకు ఎంతో కష్టతరమైన మెడ్ స్కూల్లో ఆమె నన్ను జాగ్రత్తగా చూసుకుంది. ప్రతిఫలంగా ఒక్కసారి కూడా ఏమీ అడగలేదు. ఆమె ఆసుపత్రిలో ఉండ‌టం వ‌ల్ల‌ నా బార్బియన్ ప్రదర్శనను మొదటిసారి చూడలేకపోయింది. ఆమెకు చూపించడం నా మొత్తం జీవితంలో ఒక మ‌రుపురాని అనుభూతి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను మామ!" అని ఈ వీడియోకు డాక్ట‌ర్ వివరణాత్మక క్యాప్షన్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed