ఈ పండు తినండి.. ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి!

by Prasanna |
ఈ పండు తినండి.. ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి!
X

దిశ, ఫీచర్స్ : మనలో చాలా మంది అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. మంచి ఆహారం తీసుకుంటే ఈ మందులను దూరం పెట్టొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. పైనాపిల్ తో అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే డీహైడ్రేషన్ ప్రమాదాన్ని తగ్గించడంలో పైనాపిల్ సహాయపడుతుంది.

ముఖ్యంగా వేసవిలో కొంత మంది కడుపు నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. మనం తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ పండులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కడుపులో అసౌకర్యాన్ని దూరం చేస్తాయి.

అధిక వేడి వలన రక్తపోటు పెరిగే అవకాశం ఉంది. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. పైనాపిల్ తినడం వల్ల శరీరంలో మంట తగ్గుతుంది. దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది నొప్పి, వాపు నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. వేసవిలో బరువు తగ్గాలంటే ఖచ్చితంగా పైనాపిల్ తినాలి. ఈ పండ్లలో కేలరీలు తక్కువగా.. ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే ఈ పండు మీ చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది.

Advertisement

Next Story

Most Viewed