- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రిపూట మీరు చేయకూడని 7 పనులు..! చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
దిశ, ఫీచర్స్ : రోజులో 24 గంటలు కాగా అందులో రాత్రి, పగలు ఉంటాయి. ఇవి రెండూ వేర్వేరు ప్రకృతి నియమాలను కలిగి ఉంటాయి. రాత్రి చీకటిగా ఉంటుంది. పగలు వెలుతురు ఉంటుంది. రాత్రిళ్లు చంద్రుడు కనిపిస్తాడు, పగలు సూర్యుడు ఉదయిస్తాడు. అలా కాకుండా భిన్నంగా జరిగితే.. ప్రమాదానికి సంకేతం కావచ్చు. అలాగే మనుషులు కూడా రాత్రిపూట చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. ఏం అవుతుందిలే అనుకొని చేస్తే హెల్త్ రిస్క్‌లో పడొచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి పనులేవో ఇప్పుడు చూద్దాం.
* కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం : చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే ఇవి రాత్రిపూట తాగడం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. క్రమంగా మానసిక రుగ్మతలకు, ఇతర అనారోగ్యాలకు దారితీస్తుంది. కాబట్టి రాత్రిపూట కెఫిన్ రిలేటెడ్ పానీయాలకు, ఆహారాలకు దూరంగా ఉండటం బెటర్.
* అతిగా తినడం : కొందరు నిద్రపోవడానికి కొద్దిసేపు ముందు భోజనం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదు. కనీసం గంటన్నర ముందు తినాలి. అది కూడా అతిగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. దీంతో కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. అలా డైజెస్ట్ కాని పదార్థాలు కొవ్వురూపంలో మారి ఊబకాయానికి, మధుమేహానికి, గుండె జబ్బులకు దారితీయవచ్చు.
* ఆల్కహాల్ తాగడం : మద్యం అలవాటు ఉన్నవారు చాలా మంది రాత్రిపూట ఎక్కువగా తాగుతుంటారు. దీనివల్ల నిద్ర బాగా పడుతుందని చెప్తారు. కానీ మత్తు వేరు, క్వాలిటీ స్లీప్ వేరు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మత్తులో వచ్చిన నిద్రవల్ల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరవు. పైగా స్లీప్ సైకిల్ దెబ్బతింటుంది. క్రమంగా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది.
* హెవీ వర్కవుట్స్ : ఆరోగ్యానికి వ్యాయామం చాలా మంచిది. రాత్రిపూట కూడా తేలికపాటి వ్యాయామాలు చేయడంవల్ల నిద్ర బాగా పడుతుంది. అలాగనీ హెవీ వర్కవుట్స్ మాత్రం అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల బాడీ స్టిమ్యులేట్ అయి నిద్ర పాడవుతుంది.
* సాయంకాలపు నిద్ర : నిద్రపోవడం మంచి లక్షణం. అయితే సమయం సందర్భం లేకుండా నిద్రపోతేనే కష్టం. వీలైతే మధ్యాహ్నం కాసేపు కునుకు తీయొచ్చు కానీ సాయంకాలం 4 గంటల తర్వాత నిద్రపోవడం మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే దీనివల్ల రాత్రిపూట నాణ్యమైన నిద్రకు దూరం అవుతారు. ఇది ఆరోగ్యంపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపుతుంది.
* ఒత్తిడిలో పనిచేయడం : కొంతమంది సాయంత్రం ఖాళీగా ఉన్నా పనులు చేసుకోకుండా, రాత్రి నిద్రపోవడానికి ముందు చేస్తుంటారు. అర్ధరాత్రి వరకు ఇంటి పనులో, ఆఫీసుకు సంబంధించిన పెండింగ్ పనులో చేస్తుంటారు. రెగ్యులర్‌గా నైట్ షిఫ్టులు చేసే అలవాటు ఉన్నవారు ఇలా చేస్తే ఇబ్బందులు తలెత్తకపోవచ్చు. ఎందుకంటే వారి శరీరం, మెదడు అందుకు అనుగుణంగా అలవాటు పడి ఉంటాయి. కానీ రాత్రిపూట మేల్కొనే అలవాటు లేనివారు అప్పుడప్పుడు లేదా కొన్నిరోజుల కోసం ఇలా చేయడంవల్ల వారి స్లీప్ సర్కిల్‌కు ఆటంకం ఏర్పడి మరింత ఒత్తిడి పెరుగుతంది. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెప్తున్నారు.
* లైట్లు ఆర్పకుండా పడుకోవడం : రాత్రిపూట లైట్లు ఆర్పకుండా పడుకునే అలవాటు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఎందుకంటే కాంతివంతమైన లైట్ల వెలుతురులో మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కాబట్టి నిద్రపోవడానికి ముందు గదిలో డిమ్ లైట్ వేసుకోవాలి లేదా లైట్లు ఆర్పివేసి పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.