జాగ్రత్త.. ఇలా చేస్తే మీ ఆయుష్షు తగ్గుతుందంట!

by Jakkula Samataha |   ( Updated:2024-03-03 04:29:11.0  )
జాగ్రత్త.. ఇలా చేస్తే మీ ఆయుష్షు తగ్గుతుందంట!
X

దిశ, ఫీచర్స్ : గరుడ పురాణం ప్రకారం మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. మనిషి పుట్టుక, చావు, ఇలా మానవ జీవితం గురించి ఎన్నో విషయాలు ఇందులో విపులంగా తెలియజేయడం జరిగింది. ఇది మానవులకు కొన్ని నియమాలను కూడా తెలియజేస్తుంది. మనిషి చేయకూడని కొన్ని పనులు ఇందులో తెలియజేయడం జరిగింది. అయితే గరుడ పురాణం ద్వారా, మనిషి ఆయుష్షు దేని వలన తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తి తప్పుడు మార్గంలో వెళ్లడం, తప్పుడు పనులు చేయడం, తెలిసి కూడా పాపాలు చేయడం అనేది మంచిది కాదంట. దీని వలన అతని ఆయుష్షు తగ్గుతుందంట. అలాగే దక్షిణం లేదా పడమర వంటి తప్పు దిశలో తల ఉంచి నిద్రించడం కూడా ఆయుష్షును తగ్గిస్తుందని చెబుతున్నారు పండితులు. మనం ఏదైనా గదిలో ప్రవేశించేటప్పుడు దానిలో కొంత కాంతి అనేది ఉండాలంట. అలా కాకుండా గది మొత్తం చీకటిగా ఉన్న గదిలోకి అస్సలే ప్రవేశించకూడదు. ఇది చాలా సమస్యల్లోకి నెట్టేస్తుంది. అదే విధంగా, విరిగిన మంచం, చనిపోయిన వారిని దహనం చేసేటప్పుడు వచ్చే పొగకు చాలా దూరం ఉండాలి. దీని వలన కూడా ఆయుష్షు తగ్గే అవకాశం ఎక్కువ ఉన్నదంటున్నారు పండితులు.

ముఖ్యంగా గరుడ పురాణం ప్రకారం ఎక్కువ కాలం జీవించాలంటే ఉదయం ఆలస్యంగా నిద్రలేచే అలవాటును మార్చుకోవాలంట. బ్రహ్మ ముహూర్తంలో మేల్కోవడం మంచిదని పురాణ గ్రంథాలలో పేర్కొనబడింది. ఉదయపు గాలి కూడా స్వచ్ఛమైనది. ఇది అనేక వ్యాధుల నుంచి మానవులను రక్షిస్తుంది.అందువలన బ్రహ్మముహుర్తంలో నిద్ర లేవడం ఆరోగ్యానికి చాలా మంచిది.

Advertisement

Next Story

Most Viewed