- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సహజీవనం చేస్తున్న మహిళకు కూడా పార్టనర్ ఆస్తిపై హక్కు ఉంటుందా?
దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కట్టుకున్న భార్య ఉన్నా కొందరు సీక్రెట్‌గా సెకండ్ పార్టనర్‌ను మెయింటేన్ చేస్తున్నారు. అయితే కొందమంది సెకండ్ పార్టనర్స్ తమ పార్టనర్ ఆస్తిలో వాటా అడుగుతారు. అయితే ఇలా చేసే వారికి ఆస్తిలో వాటా ఉండదు అనుకుంటారు. కానీ సహజీవనం చేస్తున్న లివ్ ఇన్ పార్టనర్ సైతం, ఆస్తిలో వాటా డిమాండ్ చేయవచ్చు. దీనికి సంబంధించిన రూల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
లివ్-ఇన్ రిలేషన్స్‌లో భాగస్వాములకు పుట్టిన పిల్లలను చట్టబద్ధ వారసులుగా పరిగణించవచ్చని కూడా తీర్పు చెప్పింది. కానీ దీనికి సంబంధించి అధికారిక చట్టం లేదు. మేల్ పార్ట్నర్కి చెందిన ఆస్తుల్లో లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ఫీమేల్ పార్ట్నర్కి ఉన్న హక్కులు ఇప్పటికీ అస్పష్టంగా ఉన్నాయి.
తండ్రి వీలునామాను సహజీవనం చేస్తున్న మహిళ సవాలు చేసిన సందర్భంలో, వీలునామా వాస్తవికతను నిరూపించే భారం లేదా ప్రొబేట్ ప్రొసీడింగ్‌లో కాంటెస్ట్ చేయడానికి ఫీమేల్ పార్ట్నర్ అర్హత న్యాయస్థానంపై ఆధారపడి ఉంటుంది. ఆమె చేసిన వాటా క్లెయిమ్‌ను వ్యతిరేకించేందుకు వీలునామా లబ్ధిదారులు అవసరమైన ఆధారాలు అందజేయాలి. అందుబాటులో ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా క్లెయిమ్‌ల చెల్లుబాటును కోర్టు నిర్ణయిస్తుంది. ఆస్తిలో వాటా పొందేందుకు ఉన్న అర్హత కారణాలను సహజీవనం చేసిన మహిళ సాక్ష్యాధారాలతో కోర్టుకు సమర్పించాలి. అలా చేసినట్లైతే ఆస్తిలో వాటా పొందవచ్చునంట.
భారతదేశంలో ఒక వ్యక్తి వీలునామా లేకుండా మరణించినప్పుడు, వారి ఆస్తి పంపిణీ హిందూ వారసత్వ చట్టం ద్వారా నిర్ణయిస్తారు. ఈ చట్టం వారసులను రెండు వర్గాలుగా క్లాస్ I, క్లాస్ IIగా విభజిస్తుంది. మరణించినవారి ఆస్తిని వారసత్వంగా పొందడంలో క్లాస్ II వారసుల కంటే క్లాస్ I వారసులకు ప్రాధాన్యత ఉంటుంది. క్లాస్ I వారసులు ఉంటే, క్లాస్ II వారసులు ఎస్టేట్‌లో ఎలాంటి వాటాకు అర్హులు కారు.
Read More: మీ చర్మంపై ఈ లక్షణాలు ఉంటే.. మీ శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నట్లే?