గ్యాస్ వెలిగించడానికి అగ్గిపెట్ట, లైటర్‌లో ఏది బెటరో తెలుసా?

by Jakkula Samataha |
గ్యాస్ వెలిగించడానికి అగ్గిపెట్ట, లైటర్‌లో ఏది బెటరో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది గ్యాస్ స్టవ్ వినియోగించి తమ వంట తొందరగా చేసుకుంటారు. మరికొందరు రైస్ కుక్కర్ ను ఉపయోగిస్తారు. ఏది ఏమైనా వంట తొందరగా అయిపోతే సగం పని పూర్తి అయినట్లే అని ఇంటి ఆడపడుచులు భావిస్తారు.అసలు విషయం ఏమిటంటే గ్యాస్ ఆన్ చేయడానికి చాలా మంది అగ్గిపుల్లను కూడా వినియోగిస్తున్నారు. దాని వల్ల వెలిగించిన అగ్గిపుల్ల నుంచి కొన్ని రకాల వాయువులు వెలువడుతాయి.అగ్గిపుల్లతో గ్యాస్ వెలిగించినప్పుడు మాత్రం కచ్చితంగా తొందరగానే దాన్ని ఆర్పేయాలి. లేకపోతే చాలా ప్రమాదం. ఎలాగంటే గ్యాస్ ఆన్ చేసినప్పుడు గ్యాస్ స్టవ్ నుంచి విడుదలైన వాయువు గాలిలో కలిసిపోయి ఉంటుంది. అందువల్ల మీరు అగ్గిపుల్లను ఆర్పయేక పోయినట్లైతే ఆ వాయువు తో కలిసి మంటలు వ్యాపించేలా చేస్తుంది.

ఈ క్రమంలో గ్యాస్ స్టవ్ ఆన్ చేయడానికి లైటర్ ని వినియోగిస్తే మంచిది అని అర్థం అవుతోంది. అందుకే గ్యాస్ స్టౌవ్‌ను అగ్గిపెట్టేతో ఆన్ చేసినట్లయితే,మొదటగా స్టిక్‌ను వెలిగించాలి. ఆ తర్వాత గ్యాస్ స్టౌవ్‌ బటన్‌ను ఆన్ చేయండి. తద్వారా గ్యాస్ స్టౌవ్‌ త్వరగా వెలిగిపోతుంది.అయితే కొందరు ప్రతిసారి గ్యాస్‌ స్టౌవ్‌ అగ్గిపెట్టేతో మాత్రమే వెలిగించే వారు ముందు గ్యాస్‌ ఆన్‌ చేయకూడదు.అయితే మీరు ముందుగా గ్యాస్ ను ఆన్ చేయడం వల్ల గ్యాస్ వృధాగా పోతుంది.ఎక్కువ వాయువును గాలిలోకి విడుదల చేస్తుంది.అది అగ్ని ప్రమాదానికి కారణమవుతుంది.కొన్నిసార్లు గ్యాస్‌ను వెలిగించే సమయంలో గ్యాస్‌ స్టౌవ్‌ సిమ్‌లో ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత మీ సౌకర్యాన్ని బట్టి గ్యాస్ స్టౌవ్‌ మంటను పెంచుకోవచ్చు.

మీరు గ్యాస్‌ ఆన్‌ చేసే విషయంలో ఈ జాగ్రత్తలు పాటించల్సి ఉంటుంది.అయితే గ్యాస్ వెంటనే వెలిగించకపోయినా, ఏ మాత్రం ఆలస్యం చేసినా వెంటనే గ్యాస్‌ ఆఫ్ చేయండి.వెలిగించిన అగ్గిపుల్లను తొందరగా ఆర్పేయలి.గ్యాస్ స్టౌవ్‌ నుంచి వచ్చే గ్యాస్ గాలిలో కలిసిపోతుంది.ఒకవేళ మీరు గ్యాస్ ని అగ్గిపుల్లతో వెలిగించినట్లయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంచెం అజాగ్రత్తగా ఉన్న మంటలు విజృంభిస్తోంది.అందువల్ల గ్యాస్ స్టవ్ ఆన్ చేయడానికి లైటర్ ని ఉపయోగించండి.

Advertisement

Next Story

Most Viewed