మీరు చనిపోయినట్లు కల వచ్చిందా.. అయితే జరిగేది ఇదేనంట!

by samatah |   ( Updated:2023-02-11 10:26:47.0  )
మీరు చనిపోయినట్లు కల వచ్చిందా.. అయితే జరిగేది ఇదేనంట!
X

దిశ, వెబ్‌డెస్క్ : కలలు రావడం అనేది చాలా సహజం. ప్రతి ఒక్కరూ కల కంటూ ఉంటారు. అయితే ఒకొక్కరికి ఒక్కోరకమైన కల వస్తూ ఉంటుంది. కొందరికి పక్షులు కనిపిస్తే మరికొందరికి జంతువులు, మొక్కలు కనిపిస్తుంటాయి. ఇంకొంత మందికి పూర్వీకులు, లేదా ఎవరికైనా పెళ్లి జరుగుతున్నట్లు, యాక్సిడెంట్స్ అయినట్టు కలవస్తుంది. కానీ కొంత మందికి మాత్రం వాళ్లే చనిపోయినట్టు కలవస్తుంది.

అయితే అలా కల రావడంతో చాలా మంది భయపడి పోతుంటారు. ఏంటీ నేను చనిపోతానా అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ స్వప్నశాస్త్రం ప్రకారం వారు చనిపోయినట్లు కల రావడం శుభ సంకేతమేనంట. దీని గురించి స్వప్న శాస్త్ర నిపుణులు మాట్లాడుతూ.. మీరు చనిపోయినట్లు కల వస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా కల రావడం వలన మీ దీర్ఘ కాలిక సమస్యలన్నీ తొలిగిపోయి మీరు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు అన్నట్లు సూచన అంటూ తెలిపారు.

Advertisement

Next Story