- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
30 రోజులు ఉల్లిపాయ తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
దిశ, ఫీచర్స్: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత మనం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. ఉల్లిపాయ అనేది ప్రపంచవ్యాప్తంగా వంటలో ఎక్కువగా ఉపయోగించే ఒక కూరగాయ. బర్గర్ల నుండి ఫ్రైస్ వరకు, ఇలా అన్నింటిలో మంచి రుచి కోసం ఉల్లిపాయలను వాడుతుంటారు. పచ్చి ఉల్లిపాయలు చాలా మంది తింటుంటారు. ఇవి తిన్న తర్వాత నోటి దుర్వాసన కూడా వస్తుంది. అయితే, 30 రోజుల పాటు ఉల్లిపాయలు తినకపోతే ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఉల్లిపాయలు కేవలం రుచి కోసమే కాదు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి. ఇవన్నీ మీ శరీర ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.విటమిన్ సి, బి6 , ఫోలిక్ యాసిడ్ ఉల్లిపాయల్లో ఉంటాయి. రోగనిరోధక వ్యవస్థ, కణాల పెరుగుదల, ఆరోగ్యకరమైన జీవక్రియకు ఇది చాలా ముఖ్యమైనవి.
ఉల్లిపాయలు తినకపోవడం వల్ల వచ్చే సమస్యలు:
ఉల్లిపాయలు అనేక పోషకాలతో నిండి ఉంటుంది. మీ ఆహారం నుండి వాటిని ఉల్లిపాయను దూరం చేయడం వలన ఈ పోషకాలలో లోపాలను కలిగిస్తుంది. మీరు ఉల్లిపాయలను తినకుండా ఉంటే మాంగనీస్, పొటాషియం, విటమిన్ సి, బి6, ఫోలిక్ యాసిడ్ వంటి ఖనిజాలు శరీరానికి అందుబాటులో లేకుండా పోతాయి. ఇది రోగనిరోధక శక్తిని కూడా బలహీనపరుస్తుంది.