Facial mists : అదిరిపోయే సౌందర్యాన్ని పెంచే ఫేషియల్ మిస్ట్స్..

by Sumithra |
Facial mists : అదిరిపోయే సౌందర్యాన్ని పెంచే ఫేషియల్ మిస్ట్స్..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : చర్మం మెరిసేలా, ఆరోగ్యంగా ఉండాలంటే, దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చర్మం పై సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడే అలవాటు లేని వారు స్కిన్ మిస్ట్ వాడవచ్చు. దీంతో చర్మం పూర్తిగా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

చర్మవైద్యనిపుణుల ప్రకారం స్త్రీలతో పాటు పురుషులకు కూడా ఫేషియల్ మిస్ట్ తప్పనిసరిగా వాడవచ్చు. దీని సహాయంతో పొడి చర్మం సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మీ రోజువారీ స్కిన్ కేర్ రొటీన్‌లో ఫేషియల్ మిస్ట్‌ని ఉపయోగించడం ద్వారా కూడా మీరు మీ చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

ఫేస్ మిస్ట్ అనేది ఒక రకమైన స్ప్రే అని స్కిన్ ఎక్స్‌పర్ట్ లు చెబుతున్నారు. ఇది మూలికలు, విటమిన్లు, వివిధ సహజ పదార్ధాల నుండి తయారవుతుంది. పొడి నుండి జిడ్డు వరకు అన్ని రకాల చర్మాలకు ఫేస్ మిస్ట్ మంచిది. మార్కెట్‌లో చాలా రకాల ఫేస్ మిస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. మీరు రోజ్ వాటర్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా దాని ప్రయోజనాలు ఏంటంటే.

హైడ్రేటెడ్ చర్మం..

ఫేషియల్ మిస్ట్స్ వాటి హైడ్రేటింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది స్కిన్ క్రీమ్ లేదా ఆయిల్ కంటే తేలికగా ఉంటుంది. పొడి చర్మం ఉన్నవారికి ఫేషియల్ మిస్ట్స్ చాలా ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు స్కిన్ స్పెషలిస్టులు. ఫేషియల్ మిస్ట్ ను రోజుకు రెండు సార్లు ఉపయోగించవచ్చు.

చర్మం ఆరోగ్యానికి..

గులాబీ, కలబందతో చేసిన ఫేస్ మిస్ట్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కలబంద దాని లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇవి చర్మాన్ని కాలుష్యం నుండి రక్షిస్తాయి. అంతే కాదు ముఖం మీద ఉండే ఎరుపు, చికాకు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

యాంటీ ఏజింగ్ లక్షణాలు..

ఫేషియల్ మిస్ట్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలను బిగించి, ముడతలను తగ్గించేందుకు ఫేషియల్ మిస్ట్ ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. ముడతలు, ఫైన్ లైన్లకు సంబంధించిన సమస్య ఉంటే ఈ ఫేస్ మిస్ట్ ను ఉపయోగించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed