మీ ఇంటి ముందు ఈ వస్తువులు ఉంచుతున్నారా.. ?

by Prasanna |
మీ ఇంటి ముందు ఈ వస్తువులు ఉంచుతున్నారా.. ?
X

దిశ, ఫీచర్స్: వాస్తు ప్రకారం, ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచకుండా చూసుకోవాలి. ఇంటికి ఆర్థిక సంక్షోభం వస్తుంది. ఇది కూడా ప్రతికూలతను కలిగిస్తుంది. దీంతో ఈ ఇంటి వాసులకు కష్టాలు మొదలవుతాయి. వాస్తు ప్రకారం, ఇంట్లో ఈ వస్తువులను ఉంచడం వలన ఆర్థిక సంక్షోభం కలుగుతుంది. కాబట్టి, ఈరోజే వాటిని వెంటనే తొలగించండి.

పని చేయని గడియారం

ఇంట్లో మనంసమయాన్ని చూసేందుకు గడియారాలు పెట్టుకుంటాం. అయితే, ఇంట్లో గోడకు వేలాడుతున్నప్పుడు కూడా గడియారం పని చేయకపోతే వెంటనే దాన్ని తీసేసి పక్కన పెట్టండి. పగిలిన గడియారాన్ని కూడా ఇంట్లో ఉంచకూడదు. దీని వల్ల అశాంతి ఏర్పడుతుంది. మీరు ఏమి చేసినా, మీరు విజయం సాధించలేరు. ఇది ఇంటికి ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుంది.

పగిలిన పాత్రలు

వాస్తు ప్రకారం, విరిగిన వంటగది పాత్రలను కూడా ఇంట్లో ఉపయోగించకూడదు. ఇంట్లో తినే ప్లేట్లు వంటి పాత్రలను పగలగొట్టకూడదు. ఇది ప్రతికూలతను ఇంటికి తీసుకువస్తుంది. అలాగే రిలేషన్‌షిప్‌లో బ్రేక్‌కి కూడా దారి తీస్తుంది. ఇంట్లో కొత్త కష్టాలు మొదలవుతాయి.

ముళ్లచెట్టు

ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెట్టుకోవడం వల్ల ఇంటికి శుభాన్ని ఇస్తే, మరికొన్ని మొక్కలు ఆశుభాన్ని ఇస్తాయి. మీ ఇంట్లో కొన్ని రకాల ముళ్ల చెట్లను ఇంటి లోపల ఉంచకూడదు. ఇది ఇంట్లో ప్రతికూలతను తెస్తుంది. మీ ఇంటికి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలంటే, మీ ఇంటి నుండి ముళ్ల మొక్కలను తొలగించండి. తులసి, కలబంద మొక్కలను మాత్రమే ఇంటి లోపల ఉంచాలి.

Advertisement

Next Story

Most Viewed