- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్కిన్ ప్రాబ్లమ్స్‌తో గుండె జబ్బులు.. హెచ్చరిక సంకేతాలివే
దిశ, ఫీచర్స్ : కొన్నిసార్లు మీ చర్మం నీలి రంగులోకి మారుతూ ఉంటుంది. మరి కొన్ని సందర్భాల్లో పసుపు రంగులో కనిపిస్తూ ఉంటుంది. ఇంకొన్ని సార్లు స్కిన్‌పై ఎర్రటి మచ్చలు దర్శనమిస్తుంటాయి. అయితే ఇవన్నీ సాధారణ సమస్యల్లాగా అనిపించినప్పటికీ మీ గుండె బలహీనంగా ఉందని, శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించే సంకేతాలని ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు అంటున్నారు. ముఖ్యంగా 6 రకాల చర్మ సమస్యలు గుండె జబ్బులతో ముడిపడి ఉంటాయని చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
1. సైనోసిస్
మీ చర్మం, పెదవులు, గోళ్లు నీలం రంగులో కనిపిస్తాయి. రక్తంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఇది గుండె వైఫల్యం లేదా పుట్టుకతో వచ్చే గుండె లోపానికి సంకేతం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ సమస్య ఉన్నవారు అవసరమైన వైద్య పరీక్షలు చేయించుకొని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా రాబోయే గుండె జబ్బుల ప్రమాదం నుంచి బయట పడవచ్చు.
2. క్లబ్బింగ్
చేతివేళ్లపైన గోళ్ల చుట్టుపక్కల చీము పట్టడం, నొప్పి కలగడం వంటి ఇబ్బందులను క్లబ్బింగ్ అంటారు. రక్తంలో ఆక్సిజన్ చాలా తక్కువగా ఉండటంవల్ల ఇలా జరుగుతుంది.ఈ పరిస్థితి పుట్టుకతో వచ్చే గుండె జబ్బులవల్ల తలెత్తవచ్చు లేదా దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నా కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి.
3. కొవ్వు నిల్వలు
చర్మంపై కొవ్వు నిల్వలు (Xanthomas) పసుపురంగు గడ్డలుగా కనిపిస్తాయి. హై కొలెస్ట్రాల్ ఉన్నవారిలో ఈ సమస్య ఉంటుంది. అయితే తరచూ ఈ సమస్యలు తగ్గకుండా కంటిన్యూ అవుతుంటే మాత్రం గుండె జబ్బులకు దారితీస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
4. పెటెచియా
చర్మం ఉపరితలం కింద రక్తస్రావం జరిగినప్పుడు కనిపించే చిన్నపాటి ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలను పెటెచియాస్ అంటారు. ఇవి ఇన్ఫెక్టివ్ ఎండోకార్డిటిస్‌కు సంకేతం కావచ్చు. గుండె కవాటాల్లో తీవ్రమైన ఇన్ఫెక్షన్ వల్ల కూడా కలుగుతాయి.
5. ఓస్లర్ నోడ్స్
ఓస్లర్ నోడ్స్ అనేవి అరి కాళ్లు, చేతి వేళ్లపైన, అరిచేతుల్లో చిన్నపాటి గాయాల మాదిరిక కనిపంచే ఎరుపు రంగు మచ్చలు. ఇవి ఏవైనా గాయాలు కలిగినప్పుడు, ముళ్లు గుచ్చుకున్నప్పుడు నిలిచిపోయిన గాయాల మాదిరి కనిపిస్తుంటాయి. గుండె జబ్బుల ప్రమాద హెచ్చరికగా పరిగణించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
6. స్పైడర్ వీన్స్
చర్మంలోని నరాలు ఉబ్బినట్లు పైకి కనిపించే పరిస్థితినే స్పైడర్ వీన్స్ లేదా సిరలు అంటారు. గుండె కవాటాల్లో లోపాలు లేదా కాలేయ వ్యాధితో సంబంధం కలిగి ఉంటాయి. గుండె పనితీరును పరోక్షంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ సమస్య ఉన్నవారు జాగ్రత్త పడాలి. లేకపోతే గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలకు దారితీవయచ్చు.
Read More: ఎదుటి వారిని చూసి అసూయ పడుతున్నారా.. అయితే మీకు ఈ జబ్బు ఉన్నట్లే..!
మీరు 20 ఏళ్ల సింగిల్ ఉమెనా? అయితే ఇది విని విసుగెత్తిపోవాల్సిందే!