నానబెట్టిన మెంతులతో ప్రయోజనాలు

by Sujitha Rachapalli |
నానబెట్టిన మెంతులతో ప్రయోజనాలు
X

దిశ, ఫీచర్స్ : ప్రతి భారతీయ వంట గదిలో ఉండే మెంతులు ఆరోగ్యానికి వరమని అంటున్నారు నిపుణులు. సాధారణంగా బరువు తగ్గేందుకు ఎంచుకునే ఈ గింజలు.. రోజూ ఉదయాన్నే తీసుకోవడం వల్ల భారీ ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందుకోసం రెండు స్పూన్ల మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ వాటర్ తాగాలి.

వెయిట్ లాస్

బరువు తగ్గడాన్ని వేగవంతం చేయడానికి మెంతి అత్యుత్తమ పదార్థం. ఈ విత్తనాలు ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండుగా ఉందనే భావాలను పెంచుతాయి, తద్వారా అతిగా తినకుండా, బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తుంది. అయితే అతిగా తినడం వల్ల కడుపులో ఇబ్బంది ఏర్పడవచ్చు. డయాబెటిక్ పేషంట్స్ ఇవి తీసుకునే ముందు వైద్యుల సలహా ఫాలో కావాలి.

గట్ హెల్త్

మెంతులు పీచు, ఖనిజాలు, ఇతర పోషకాలను కలిగి ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ విత్తనాలలో రోజువారీ సిఫార్సు చేయబడిన ఐరన్ 20%, మాంగనీస్ 7%, మెగ్నీషియం 5% ఉంటాయి. మెంతి గింజల్లో శ్లేష్మం ఉంటుంది. ఇది జీర్ణశయాంతర మంటను తగ్గిస్తుంది. కడుపు, ప్రేగు గోడలను కోట్ చేస్తుంది. హార్ట్ బర్న్, యాసిడ్ రిఫ్లక్స్ విషయంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

తక్కువ కొలెస్ట్రాల్

మెంతిలో ఉండే సపోనిన్‌లు.. కొవ్వు పదార్ధాల నుంచి కొలెస్ట్రాల్‌ను శరీరం శోషించడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కొన్ని పరిశోధనల ప్రకారం సపోనిన్లు శరీరం చెడు కొలెస్ట్రాల్‌ను

తక్కువగా ఉత్పత్తి చేయడంలో సహాయపడవచ్చు.

PCOS, PCOD నుంచి ఉపశమనం

మెంతులు హైపర్గ్లైసీమిక్ పరిస్థితులలో ఇన్సులిన్ స్రావాన్ని పెంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరిగేలా చేస్తాయి. ఈ విత్తనాలు పిసిఒఎస్ లేదా పిసిఒడికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. రక్తహీనతను నయం చేయగలవు, రొమ్ము పాల సరఫరాను పెంచుతాయి, పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతాయి. క్యాన్సర్‌ను నివారించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed