- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బెల్లీఫ్యాట్ పేరుకుపోయిందా?.. నిపుణుల సూచనలివే..
దిశ, ఫీచర్స్ : మనం తినే ఆహారాలవల్ల, శారీరక శ్రమలేని జీవనశైలివల్ల శరీరంలో ఫ్యాట్ పేరుకుపోతూ ఉంటుంది. ఎక్కువగా పొట్టభాగంలోనే స్టోర్ అవుతుంది. దీంతోబాన పొట్ట కనిపించే అవకాశం పెరుగుతుంది. అయితే ఇలా బెల్లీ ఫ్యాట్ పేరుకుపోవడంవల్ల అందం విషయంలోనే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా చలికాలంలో వ్యాయామం చేయకపోవడం, ఆహారం ఎక్కువగా తినడం వంటి కారణాలతో బెల్లీఫ్యాట్ సమస్య ఎదురవుతుంది. కొన్ని వేడినీటి పానీయాలతో కూడా ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని ఆయుర్వేదిక్ నిపుణులు చెప్తున్నారు.
ఒక గ్లాసు వేడి చేసిన పాలలో ఒక స్పూను పసుపు, అలాగే నల్ల మిరియాల పొడిని కలుపుకోవాలి. ఇలా ప్రతి రోజు తాగుతూ ఉంటే.. కొవ్వు త్వరగా కరిగిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆకలి తక్కువగా వేస్తుంది. ఇక నీటిలో అల్లం తరుగును వేసి మరిగించి, ఆ నీటిని వడకట్టి ఒక గ్లాసులో పోసి, కాస్త నిమ్మరసం, తేనె కలుపుకొని దాగడంవల్ల కూడా బెల్లీఫ్యాట్ రాకుండా ఉంటుంది. దీంతోపాటు నీటిలో ఒక స్పూను దాల్చిన చెక్క పొడిని వేసి మరిగించాలి. తర్వాత గ్లాసులో వేసి ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగడంవల్ల బ్లడ్‌లో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. అలాగే గ్రీన్ టీ గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులోని ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగితే కూడా కొవ్వు పేరుకుపోకుండా నివారించవచ్చు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మ చెక్క నుంచి తీసిన రసాన్ని వేసి, ఒక స్పూన్ తేనె, చిటికెడు మిరియాల పొడి కలిపి తాగడంవల్ల కూడా బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది.